వంద శాతం పోలింగ్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

వంద శాతం పోలింగ్‌పై అవగాహన

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

వేలూరు: అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్‌పై కోరుతూ తిరువణ్ణామలై ప్రభుత్వ మెడికల్‌ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎన్నికల అధికారి తర్పగరాజ్‌ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ తిరువణ్ణామలైలోని మాడ వీధుల్లో ప్రారంభమై పలు వీధుల గుండా అవగాహన కరపత్రాలు అందజేస్తూ అవగాహన కల్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరువణ్ణామలై జిల్లా వందశాతం పోలింగ్‌ జరగాలని, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించామన్నారు. ప్రస్తు తం వైద్య విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఆస్పత్రికి వచ్చే రోగులకు కరపత్రాలు అందజేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో వంద శాతం పోలింగ్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అదేవిధంగా అరుణాచలేశ్వరాలయం సమీపంలోని భక్తుల వద్ద వంద శాతం పోలింగ్‌పై అవగాహన కల్పించడంతో పాటు కరపత్రాలు అందజేశారు. 18 సంవత్సరాలు నిండిన యువత అందరూ వారి ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రి సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement