భగవంతుడికి కావాల్సింది స్వచ్ఛమైన భక్తే..! | - | Sakshi
Sakshi News home page

భగవంతుడికి కావాల్సింది స్వచ్ఛమైన భక్తే..!

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

● పాణ్యం దత్తశర్మ ● అలరించిన సుదామ

గోవిందం ప్రవచనం

కొరుక్కుపేట: భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు కాదని స్వచ్ఛమైన భక్తి మాత్రమేనని హైదరాబాద్‌కు చెందిన ఆధ్యాత్మిక వేత్త పాణ్యం దత్తశర్మ వ్యాఖ్యానించారు. ఈ మేరకు దుర్గా స్రవంతి దుర్గాబాయ్‌ దేశముఖ్‌ మహిళా సభ (చైన్నె), తెలుగు తరుణి (చైన్నె) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో చైన్నె మైలాపూరులోని ఆంధ్ర మహిళా సభలో శనివారం రాత్ర సుదామ గోవిందం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వక్తగా పాల్గొన్న పాణ్యం దత్తశర్మ సుదీర్ఘంగా ప్రవచనం చేశారు. భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు కాదని, స్వచ్ఛమైన భక్తి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. తెలుగు తరుణి అధ్యక్షురాలు రమణి మాట్లాడుతూ తెలుగు తరుణి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరపడం సంతోషంగా ఉందన్నారు. ముందుగా దత్తశర్మని మణిమాలరావు, తరుణి సభ్యురాలు శాలువాతో సన్మానం చేశారు. తెలుగు తరుణి కోశాధికారి మాజెటి అపర్ణ, తెలుగు తరుణి కి చెందిన అంజని, రాజేశ్వరి, వసంత, ప్రభావతి, దేవసేన, దుర్గా స్రవంతి నిర్వాహకులు ఆంధ్ర మహిళా సభ లైఫ్‌ మెంబర్లు జయశ్రీ, పద్మావతి, భానుమతి, ఆచార్యులు విస్తాలి శంకరరావు, బిట్రా గజగౌరి, గాయనిలు అరుణ, ఎస్పీ వసంతలక్ష్మీ, రచయిత్రి ఆముక్తమాల్యద పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement