తిరుచ్చిపై వెంకన్న విహారం | - | Sakshi
Sakshi News home page

తిరుచ్చిపై వెంకన్న విహారం

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు శనివారం బంగారు తిరుచ్చి వాహనంపై విహరించారు. వారపు ఉత్సవాల్లో భాగంగా వేకువనే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు సమర్పించారు. ఈ క్రమంలోనే దేవదేవేరులకు కనులపండువగా కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేడుకగా ఊంజల్‌ సేవ జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. ఆలయ ఏఈఓ గోపీనాథ్‌, సూపరింటెండెంట్‌ రమేష్‌, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ ధనశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement