షూటింగ్‌ దశలో కోహినూర్‌ | - | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ దశలో కోహినూర్‌

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 10:15 AM

తమిళసినిమా: వజ్రాలలో రాణి కోహినూర్‌ అంటారు. అలాంటి కోహినూర్‌ ప్రత్యేకతను ఆవిష్కరించే విధంగా పలు కల్పిత అంశాలతో తెరకెక్కుతున్న తాజా చిత్రం కోహినూర్‌. ఇంతకు ముందు అలైయోడు విలైయాడు వంటి జనరంజక కథా చిత్రాన్ని నిర్మించిన భగవాన్‌ పావేందర్‌ ఈ చిత్రానికి కథనం, దర్శకత్వం బాద్యతలను నిర్వహిస్తున్నారు. దీన్ని రాజమ్‌ ఆర్‌ఈ. రాజేంద్ర కథ, మాటలను అందించి ఎస్‌పీజీ సినిమాస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. నటుడు జీవా, నవీనా, హిమా, తను ప్రసాద్‌, భావన రుద్రరాజ్‌, మాదవ్‌, మహాలక్ష్మీ,ఽ దీరన్‌ త్యాగరాజన్‌, రవి తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి రాజా శివశంకర్‌ ఛాయాగ్రహణంను, టీఎస్‌.దివాకర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ చిత్రం పలు ఆసక్తికరమైన అంశాలతో సాగుతుందన్నారు. ముఖ్యంగా కోహినూర్‌ వజ్రం ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. ఇందులో 5 పాటలు,మూడు ఫైట్స్‌ చోటు చేసుకుంటాయని చెప్పారు. కాగా తాను రాసిన కోహినూరు కోహినూరు అదిశయమే అంటూ సాగే పాట ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్ర షూటింగ్‌ను కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌ పరిసర ప్రాంతాల్లో 45 రోజుల పాటూ ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement