వేలూరు: ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను తప్పక తనిఖీ చేసి ప్రతిరోజూ వచ్చే వాహనాల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రతాప్‌కుమార్‌సింగ్ పోలీసులను ఆదేశించారు. బుధవారం రాత్రి వేలూరు జిల్లా గుడియాత్తం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన పరదరామి చెక్‌పోస్టు వద్ద ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు నుంచి నగదు, బహుమతులు తీసుకొచ్చి ఓటర్లుకు పంచే అవకాశం ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే వాహనాల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం కేవీ కుప్పం, తందైపెరియార్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు భద్రపరిచే ప్రాంతాలను పరిశీలించారు. తహసీల్దార్లు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.


