– 5 వేల మందికి శిక్షణ
సాక్షి, చైన్నె: శామ్‌సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్‌లో 5 వేల మంది విద్యార్థులకు విజయవంతంగా సాంకేతిక శిక్ష ణ అందించి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని శామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా సీఎస్‌ఆర్ హెడ్ శుభమ్ ముఖర్జీ వివరించారు. అత్యధిక డిమాండ్ ఉన్న భవిష్యత్తు సాంకేతికతలపై విద్యార్థుల కు శిక్షణ ఇచ్చారు. ఈ మేరకుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో2,200 మందికి, కోడింగ్, ప్రోగ్రామింగ్‌లో 1,700 మంది, బిగ్ డేటాలో 600 మందికి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో 500 మంది విజయవంతంగా శిక్షణ పూ ర్తి చేసి బుధవారం సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.సాంకేతిక నైపుణ్యాలతో పాటూ విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్య పరిష్కార సామర్థ్యం, కార్యాల య సంసిద్ధతను పెంపొందించేందుకు సాఫ్ట్ స్కిల్స్ మాడ్యూల్స్‌పై కూడా దృష్టి సారించారు. తమిళనాడు లో ఈ శిక్షణ పొందిన వారిలో 71శాతం మంది మహిళలు ఉండటం విశేషం. ఇది డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని సూచిస్తోంది. మద్రాస్ యూనివర్సి టీ, అన్నా యూనివర్సిటీ, క్వీన్ మేరీస్ కాలేజ్, మ హ్మద్ సతక్ ఏజే ఇంజినీరింగ్ కాలేజ్ , కోయంబత్తూరులోని కెపిఆర్ ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేశామన్నారు.


