టైసన్‌ తరువాత.. | - | Sakshi
Sakshi News home page

టైసన్‌ తరువాత..

Apr 8 2026 7:32 AM | Updated on Apr 8 2026 7:32 AM

తమిళసినిమా: నటుడు విక్రమ్‌ వారసుడు ధృవ్‌ విక్రమ్‌ టైసన్‌ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే కబడ్డీ క్రీడ నేపథ్యంలో రూపొందింది. గత ఏడాది అక్టోబర్‌ నెలలో తెరపైకి వచ్చింది. కాగా ఆరు నెలలు గడిచినా ధృవ్‌ విక్రమ్‌ తదుపరి చిత్రం సెట్‌ పైకి వెళ్లలేదు. మణిరత్నం దర్శకత్వంలో ఈయన చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అది ప్రచారంతోనే ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ధృవ్‌ విక్రమ్‌ నూతన దర్శకుడితో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ దర్శకుడి పేరు కిరణ్‌ అరవిందకుమార్‌. ఈయన ఇంతకు ముందు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా నటించినాదిత్య వర్మ చిత్రానికి అసోసియేట్‌ డైరక్టర్‌గా పని చేశారు. అంతే కాకుండా నటుడు సూర్య హీరోగా నటించిన కరుప్పు చిత్రానికి రైటర్‌గా పని చేశారు. ధృవ్‌ విక్రమ్‌ హీరోగా తెరకెక్కించే చిత్రానికి సాయి అభయంకర్‌ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోవటడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement