తమిళ సినిమా: దక్షిణ భారత సినీ ఎడిటర్ల సంఘం నూతన కార్యవర్గం పరిచయం, రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు గెలుచుకున్న వారికరిని సత్కరించే అ వేడుక ఆదివారం ఉదయం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ జరిగింది. దక్షిణ భారత సినీ ఎడిటర్ల సంఘం 2026– 2029 ఏడాదికిగాను అధ్యక్షుడిగా గోపి కష్ణ, కార్యదర్శిగా ఉమాశంకర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే. సెల్వమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు లింగుస్వామి,నిథిలన్, కార్తీక్ సుబ్బరాజ్, ఎళిల్, నిర్మాత టీ.శివ, కదిరేశన్ ,ధనుంజయన్, కరు.నాగరాజన్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు.ఈ వేదికపై దక్షిణ భారత సినీ ఎడిటర్ల నూతన కార్య నిర్వాహకుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకున్న కళాకారులను సత్కరించారు.ఈ సందర్భంగా ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే. సెల్వమణి మాట్లాడుతూ 2026 –2029 ఏడాదికి గాను నిర్వాకం బాధ్యతలు చేపట్టిన నూతన దక్షిణ భారత సినీ ఎడిటర్ల సంఘం నిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు గెలుచుకున్న కళాకారులను శుభాకాంక్షలు అన్నారు. ఫెఫ్సీకి ఎడిటర్ల సంఘం తమ శక్తికి మించి భాగస్వామ్యం అందిస్తోంది అన్నారు. ఎడిటింగ్ నిర్వహణ అన్నది ఛాలెంజింగ్ తో కూడుకున్నది అనీ, శారీరకంగానూ, మానసికంగానూ శ్రమతో కూడుకుందని పేర్కొన్నారు. అదేవిధంగా సంఘం నిర్వాహక బాధ్యత అన్నది అంత సులభం కాదు అన్నారు. ఫెఫ్సీని చూసి ముందు తనకు భయం వేసింది అనీ, అయితే ఇప్పుడు గౌరవం పెరిగిందన్నారు. తాను మొదటి నుంచి చెబుతోంది ఒక్కటేనని, నిర్మాతలు బాగుంటేనే మనం మంచిగా పని చేయగం అని ఆర్కే. సెల్వమణి పేర్కొన్నారు.


