డిజిటల్‌ లెర్నింగ్‌ విధానాన్ని అనుసరించండి | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ లెర్నింగ్‌ విధానాన్ని అనుసరించండి

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

– కలైమామణి ప్రొఫెసర్‌

జ్ఙానసంబంధం

తిరువళ్లూరు: సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పెరుగుతున్న క్రమంలో విద్యార్దులు అందుకు అనుగుణంగా డిజిటల్‌ లెర్నింగ్‌ విధానాన్ని అనుసరించాలని విద్యార్థులకు కలైమామణి ప్రోఫెసర్‌ జ్ఞానసంబంధం సూచించారు. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్‌ఎంకే ఇంజనీరింగ్‌ కళాశాలలో 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వేర్వేరు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేసే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కళాశాల వ్యవస్తాపక అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ మునిరత్నం అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్‌ కలైమామణి జ్ఞానసంబందం హాజరై బహుమతులను ప్రదానం చేసి విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రేడియన్స్‌–2026 సావనీర్‌ను విడుదల చేశారు. దీంతో పాటు వేర్వేరు రంగాల్లో రాణించి విద్యార్దులకు 54 లక్షల రూపాయలు విలువ చేసే బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఛైర్మన్‌ ఆర్‌ఎం కిషోర్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సురేష్‌కుమార్‌, డీన్‌ రామర్‌, డైరెక్టర్‌ జ్యోతినాయుడు, కార్యదర్శి యలమంచి ప్రఽధీప్‌, సలహాదారులు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పిచ్చాండి, పళణిస్వామితో పాటూ పలువురు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement