కాలువలో మునిగి ఇద్దరి మృతి | - | Sakshi
Sakshi News home page

కాలువలో మునిగి ఇద్దరి మృతి

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

అట్టహాసంగా ఎస్‌కేపీసీ స్నాతకోత్సవం బావిలో జారిపడి పాఠశాల విద్యార్థిని మృతి

అన్నానగర్‌: కోయంబత్తూరు జిన్నింగ్‌ మిల్‌ ప్రాంతానికి చెందిన కార్తికేయన్‌ (42). ఇతడి బంధువు ఇరుకూరు నారాయణస్వామి లే అవు ట్‌ ప్రాంతానికి చెందిన రక్షణ్‌ (17). ఇతడు ఇటీవలే తన ప్లస్‌–2 పరీక్షలు రాశాడు. ఈ స్థితిలో కార్తికేయన్‌, అతని కుటుంబం, రక్షణ్‌ ఈరోడ్‌ జిల్లాలోని కొడివేరికి కారులో విహారయాత్రకు వెళ్లారు. పుంజైపులియంపట్టి సమీ పంలోని సెన్బగపుదూర్‌ కాలువ గట్టు గుండా వెళుతున్నప్పుడు, వారు కారును ఆపి, అందరూ స్నానం చేయడానికి కాలువలోకి దిగారు.లోతైన స్థలంలో స్నానం చేస్తుండగా కార్తికేయన్‌, రక్షణ్‌ మునిగి చనిపోయారు. ఈ సంఘటన గురించి పోలిసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

కొరుక్కుపేట: శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల (ఎస్‌కేపీసీ) 23వ స్నాతకోత్సవాన్ని కళాశాల ప్రాంగణంలో అట్టహాసంగా నిర్వహించారు. చైన్నెలోని మద్రాస్‌ విశ్వవిద్యాలయ పరీక్షల కంట్రోలర్‌ (ఇన్‌న్‌చార్జ్‌) డాక్టర్‌ అరుల్‌ వాసు ముఖ్య అతిథిగా హాజరై 600 మంది పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 35 మంది యూనివర్సిటీ ర్యాంకర్లను ప్రత్యేకంగా సత్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, విద్యార్థులను జ్ఞాన సంపన్నులు కావాలని, విలువలను నిలబెట్టుకోవాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం చేరుకోవాలన్నారు. గౌరవ కరస్పాండెంట్‌ చిన్ని బాలాజీ మాట్లాడుతూ, నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, నాయకత్వం, విలువలతో కూడిన సంపూర్ణ అభివద్ధి ద్వారా యువతులకు సాధికారత కల్పించాలనే నిబద్ధతను ఈ సంస్థ కొనసాగిస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వనజ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నప్పిన్నై , డీన్‌ పీబీ.వనిత, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తిరుత్తణి: బావిలో జారిపడి పాఠశాల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం విషాదాన్ని మిగిల్చింది. తిరుత్తణి యూనియన్‌లోని ఎస్‌.అగ్రహారం గ్రామానికి చెందిన కరుణాకరన్‌ రైతు. అతని ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో పెద్దమ్మాయి వినిష(15) ఆర్కేపేట ప్రభుత్వ బాలికల మహాన్నత పాఠశాలలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు రాశారు. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం కరుణాకరన్‌ తన పొలంలో పనులు చేసుకుంటుండగా అక్కడే వున్న వినిత ఆమె తమ్ముడు దిలీప్‌(12) ఇద్దరుకలిసి నీరు తాగేందుకు పొలం సమీపంలోని బావిలోకి దిగారు. నీరు తాగుతుండగా వినిత కాలు జారి బావిలో పడిపోయారు. అక్కడేవున్న ఆమె తమ్ముడు కేకలు విని అక్కడే పొలం పనులు చేసుకుంటున్న కరుణాకరన్‌తో పాటూ రైతులు బావిలో దూకి వినిషను కాపాడే ప్రయత్నం చేసారు. అయితే అప్పటికే బాలిక బావిలో మునిగిపోవడంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సంఘటన ప్రాంతం చేరుకుని దాదాపు గంటపాటు శ్రమించి బాలిక మృతదేహం వెలికితీయడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement