సాక్షి, చైన్నె: తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏక గ్రీవంగా ఎంపికైన ఆరుగురు సభ్యులు సోమ వారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రపథమంగా రాజ్య సభభలో డీఎండీకే తరఫున సుదీష్ అడుగు పెట్టడంతో తమ దివంగత నేత విజయకాంత్ ఫొటోను సభలో ప్రదర్శించారు. రాష్ట్రానికి చెందిన డీఎంకే – తిరుచ్చి శివ, అందియూరు సెల్వ రాజ్, కనిమొళి సోము, ఎన్‌ఆర్ ఇలంగో, అన్నాడీఎంకే తరఫున తంబిదురై, తమిళ మానిల కాంగ్రెస్‌కు చెందిన జీకే వాసన్ పదవీ కాలం ముగియడంతో ఈ స్థానాల భర్తీకి గత నెల ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 14మంది నామినేషన్లు దాఖ లు చేయగా, ఆరుగురు ప్రధాన అభ్యర్థుల నామినేషన్లను మాత్రమే పరిశీలనలో పరిగణనలోకి తీసు కున్నారు. దీంతో వారంతా ఏకగ్రీవంగా ఎంపికై నట్టు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.శాంతి గత నెల ప్రకటించారు.ఎన్నికై న వారిలో అధికార డీఎంకే కూటమిలో నలుగురు, ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటమిలో ఇద్దరు ఉన్నారు. వీరిలో డీఎంకే కూటమిలో డీఎండీకే తరఫున ఎల్‌కే సుదీష్ తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టి ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. డీఎండీఎకే కండువా, విజయకాంత్ చిత్రంతో ఆయన రాజ్య సభలో అడుగు పెట్టారు. ఇక, అన్నాడీఎంకే నుంచి తంబిదురై మరోసారి మళ్లీ సభలో అడుగు పెట్టారు. పీఎంకే తరఫున అన్బుమణి మూడోసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇక, డీఎంకే నుంచి తిరుచ్చి శివ వరుసగా ఆరోసారి అడుగు పెట్టారు. అలాగే, డీఎంకే నుంచి కాన్ స్టంట్ రవీంద్రన్, ఈ కూటమిలోని కాంగ్రెస్‌కు చెందిన క్రిష్టోఫర్ తిలక్ మొదటిసారి రాజ్యసభలో అడుగు పెట్టారు. వీరంతా తమిళంలోనే ప్రమాణ స్వీకారం చేసి తమ మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తే, వీరికి తమిళంలోనే చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సైతం శుభాకాంక్షలు చెప్పడం విశేషం! కొత్తగా ఎంపికై న ఈఆరుగురి పదవీ కాలం 2032 వరకు ఉంటుంది.


