చైన్నె వేదికగా ఇండో–పసిఫిక్ సాంకేతిక కేంద్రం
సాక్షి, చైన్నె : ఇండో– పసిఫిక్ ప్రతిభ, సాంకేతికత, ఆవిష్కరణలకు చైన్నెను యూడబ్ల్యూఏ వేదికగా ఎంపిక చేసింది. ప్రపంచంలోని టాప్ 100 వర్సిటీలలో ఒకటైన ఆస్ట్రేలియా గ్రూప్ ఆఫ్ ఎయిట్ (జీవో8) చైన్నెలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇది కేవలం క్యాంపస్‌మాత్రమే కాదని, సాంకేతికత, మహా సముద్రాలు, మెడ్ టెక్, డిజిటల్ నైపుణ్యాలు, ఇంటి గ్రేటెడ్ ఇండస్ట్రీ – రెడీ ఇన్నోవేషన్ అనే స్తంభాలపై నిర్మించిన పరివర్తనాత్మక ఇండో – పసిపిక్ టాలెంట్ హబ్‌గా ఆవిష్కరించ బడుతుందని యూడబ్ల్యూఏ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అమిత్ చక్మా స్థానికంగా ఆదివారం వివర్మించారు. పునరుత్పాదక శక్తి, అధునాతన పరిశ్రమలు, ప్రతిభ, శక్తిని పెంపొందించడంలో గణనీయమైన అవకాశాలు దీని ద్వారా దక్కనున్నట్టు వివరించారు. చైన్నె అత్యంత కీలకంగా విద్యా, పరిశోధనల పరంగా దూసుకెళ్తోందని గుర్తుచేస్తూ, ఇక్కడ ఐఐటీఎం, వంటి విద్యార్థులు అఽధిక నాణ్యతలతో విద్యా నిలయాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే తాము సైతం ఇక్కడ అత్యంత వ్యూహాత్మకంగా యూడబ్ల్యూఏ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. హెచ్‌సీఎల్ టెక్‌తో యూడబ్ల్యూఏ సహకారం, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇంజినీరింగ్, టెక్నాలజీ నాయకత్వంలో , సాంకేతికతలలో వాస్తవ – ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా విద్యార్థులకు ఈ హబ్‌ను తీర్చిదిద్దనున్నామని తెలిపారు. హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ హెడ్ శ్రీమది శివశంకర్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు, సంస్థలతో కలిసి అభ్యాషాన్ని ఆచరణాత్మకంగా అందుబాటులోకి తీసుకు రానున్నామని వివరించారు.
మళ్లీ ఆస్పత్రిలో చేరిన నల్లకన్ను
సాక్షి, చైన్నె: సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను ఆదివారం మళ్లీ ఆస్పత్రిలోచేరారు. ఆయనకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సీపీఐ సీనియర్ నేతగా నల్లకన్ను అందరికీ సుపరిచితుడే. నిజాయితీకి ప్రతి రూపం. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినా, గళం విప్పినా అది ఆయనకే సొంతం. కనీసం సొంత ఇళ్లు కూడా ఆయనకు లేదు. ప్రభుత్వ గృహంలో ఉ న్నా, క్రమం తప్పకుండా అద్దె చెల్లించే వారు. నేటికీ తానో కుర్రోడ్ని అన్నట్టుగా చలాకీగా ముందుకు సాగే నల్లకన్ను గత ఏడాది 100వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ పరిస్థితు లలో గత నెల ఆయన ఇంట్లో జారి పడ్డట్టు సమాచారం. స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు కుట్లు వేసి చికిత్స అందించారు. అయితే ఆయనకు క్రమంగా నొప్పి తీవ్రత పెరగడంతో రాజీవ్ గాంధీ జీహెచ్‌కు తరలించారు. ఇక్కడ ఇంటెన్సివ్ కేర్‌లో కొన్ని వారాల పాటూ చికిత్స అందించారు. ఆయనకు శ్వాస సమస్య సైతం తలెత్తింది. చివరకు ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో మారు మళ్లీ ఆయన్ని రాజీవ్ గాంధీ జీహెచ్‌కు తరలించారు. ఆయనకు శ్వాస సమస్య, ఆహార నాళంకు సంబంధించి జరిగిన శస్త్ర చికిత్సలో మళ్లీ సమస్య తలెత్తడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈసమస్యను పరిష్కరించిన వైద్యు లు ఆయనున డిశ్చార్జ్ చేశారు. అయితే, ఆయ నకు ఆదివారం అదే సమస్య మళ్లీ తలెత్తింది. దీంతో రాజీవ్ గాంధీ జీహెచ్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
తమిళనాడుకు
మత్తు మాత్రల సరఫరా
● ముంబాయి డ్రగ్స్ ఏజెంట్లు అరెస్టు
తిరుత్తణి: ముంబాయి నుంచి తమిళనాడుకు ఇటీవల మత్తుమాత్రలు అక్రమ రవాణా తీవ్రమైంది. డ్రగ్స్ పెద్దఎత్తున విద్యార్థులకు విక్రయిస్తున్న ఘటనలు అధికమయ్యాయి. దీంతో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు నిఘా తీవ్రం చేశారు. దీంతో ఇటీవల కాలంగా మత్తుమాత్రలు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ వారికి పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద విచారణ చేపట్టారు. దీంతో తిరువళ్లూరు జిల్లా ఎస్పీ వివేకానంద శుక్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బందం ఏర్పాటు చేసి తమిళనాడుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన ఏజెంట్లు అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ముంబాయికి వెళ్లి డ్రగ్స్ కంపెనీ మేనేజర్ మోసిన్‌ఖాన్(32), ఆసీష్ చంద్రకాంత్ అనే ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 9,800 నిషేధిత మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ ముంబయి కోర్టులో హాజరుపరిచి, తర్వాత తిరుత్తణికి తీసుకొచ్చి వారి వద్ద మత్తు మాత్రలు తమిళనాడుకు సరఫరాకు సంబంధిచి వివరాలు సేకరించి శనివారం పుళళ్ సెంట్రల్ జైలుకు తరలించారు.
చైన్నె వేదికగా ఇండో–పసిఫిక్ సాంకేతిక కేంద్రం


