అణాలి ఫస్ట్‌లుక్ విడుదల
తమిళసినిమా: సింథియా ప్రొడక్షన్ హౌస్ పతాకంపై రూపొందుతున్న అణాలి. సింథియా లూర్దే కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి దినేష్ దినొ కథ, కథనం, మాటలు దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శక్తి వాసుదేవన్ హీరోగా నటించిన ఇందులో కుమారవేల్, ఇనియ, కబీర్‌దుహాన్‌సింగ్, అభిషేక్ వినోద్, జాన్సన్ దివాకర్, శివ, మేథ్యూవర్గీస్, వినోద్‌సాగర్, బేబీశిమాలి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రామలింగం డీసీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాలు జరుపుకుంటోంది. విచిత్ర వివరాలను దర్శకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఇది ఒక రాత్రిలో జరిగే విభిన్న కథ చిత్రంగా ఉంటుందన్నారు. కిడ్నాపర్లు లాల్ చేట్టా, ఖాన్‌బాయ్, రంగారావ్ రెడ్డిలకు చిక్కిన జాన్సీ అనే యువతి, ఆమె 10 ఏళ్ల కూతురి ఇతివృత్తంతో సాగే కథా చిత్రం అని చెప్పారు. మృగాల కంటే ఘోరమైన ఆ ముగ్గురి నుంచి జాన్సీ తెలివిగా ఎలా బయటపడ్డారు, పలు ఆసక్తికరమైన సంఘటన సమహారమే అణాలి చిత్రం అని చెప్పారు. ఈ చిత్రం దర్శకుడు వెంకట్‌ప్రభు, గణేష్ కే బాబు సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారని చెప్పారు. చిత్ర ట్రైలర్‌ను, ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.కాగా విచిత్ర షూటింగ్‌ను సినిమా చరిత్రలోనే తొలిసారిగా 10 వేల కంటైనర్లు కలిగిన యార్డులో భారీ సెట్టును వేసి చిత్రీకరించడానికి పూర్తిగా సహకారం అందించిన నిర్మాత సింథియా లూర్దేకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
అణలిలో
సింథియా లూర్దే


