ఐఐటీలో సిలికాన్‌ ఫొటోనిక్స్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఐఐటీలో సిలికాన్‌ ఫొటోనిక్స్‌ ఆవిష్కరణ

May 4 2025 6:50 AM | Updated on May 4 2025 6:50 AM

ఐఐటీలో సిలికాన్‌ ఫొటోనిక్స్‌ ఆవిష్కరణ

ఐఐటీలో సిలికాన్‌ ఫొటోనిక్స్‌ ఆవిష్కరణ

సాక్షి,చైన్నె : ఐఐటీ మద్రాస్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన సిలికాన్‌ ఫోటోనిక్స్‌ ఉత్పత్తులను శనివారం ఆవిష్కరించారు. స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఫీల్డ్‌ డిప్లాయబుల్‌ సిలికాన్‌ ఫోటోనిక్‌–ఆధారిత క్వాంటం రాండమ్‌ నంబర్‌ జనరేటర్‌ (క్యూఆర్‌ఎన్‌జీ) మాడ్యూల్‌ భారతదేశానికి గర్వకారణం అని కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్‌. కృష్ణన్‌ వ్యాఖ్యానించారు. ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో చీఫ్‌ ఇన్వెస్టిగేటర్‌ ప్రొఫెసర్‌ బిజోయ్‌ కృష్ణ దాస్‌, ఎంఈఐటీవై సైంటిస్ట్‌ ప్రాజెక్ట్‌ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ శంఖ దీప్‌ దాస్‌ సంయుక్త నేతృత్వంలో పరిశ్రమ వాటాదారుల సమావేశం జరిగింది. ఇందులో ఈ ఉత్పత్తులను కృష్ణన్‌ ఆవిష్కరించారు. వీటిని సీఎంఓఎస్‌ ఫాబ్రికేషన్‌ ప్రక్రియకు అనుకూలమైన సిలికాన్‌ ఫొటోనిక్స్‌ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి, పరిశోధన అభివృద్ధి తయారీ నమూనాను అనుసరించే విధఃగా తీర్చిదిద్దారు. కేంద్రీకృత పరిశోధన, అభివృద్ధి ద్వారా సిలికాన్‌ ఫోటోనిక్స్‌ ఉత్పత్తుల తయారీ పర్యావరణ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించే రీతిలో ఉంటుందని ప్రకటించారు. ఫోటోనిక్‌ చిప్‌ ప్యాకేజింగ్‌ కోసం ఫైబర్‌ యూనిట్‌ అటాచ్‌మెంట్‌ టూల్‌, సిలికాన్‌ ఫోటోనిక్‌ క్యూర్‌ఎన్‌జీ (క్వాంటం రాండమ్‌ నంబర్‌ జనరేటర్‌)లుగా వీటిని తీర్చిదిద్దారు.ఈ రెండు ఉత్పత్తులను గురించి కృష్ణన్‌ మాట్లాడుతూ, స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఫీల్డ్‌ డిప్లాయబుల్‌ సిలికాన్‌ ఫోటోనిక్‌–ఆధారిత క్వాంటం రాండమ్‌ నంబర్‌ జనరేటర్‌ మాడ్యూల్‌ భారతదేశానికి గర్వకారణంగా పేర్కొన్నారు. అధునాతన క్వాంటం క్రిప్టోగ్రఫీలో సహాయం చేయడానికి ఈ ఉత్పత్తిని డీఆర్‌డీఓకు అందించినట్టువివరించారు. ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. కామకోటి మాట్లాడుతూ, ‘‘సిలికాన్‌ ఫోటోనిక్స్‌ అనేది ఒక అభివృద్ధి చెందుతున్న సాంకేతికత అని వివరించారు. ఇది భవిష్యత్తు కోసం మరింత సమర్థవంతమైన, సంక్లిష్టమైన హార్డ్‌వేర్‌ను రూపొందించడంలో ఖచ్చితంగా సహాయ పడుతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఉత్పత్తులు మరిన్ని వస్తాయని ఆశిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement