తాండవ్‌తో బాలికల ఆరోగ్య సంరక్షణ | - | Sakshi
Sakshi News home page

తాండవ్‌తో బాలికల ఆరోగ్య సంరక్షణ

Apr 29 2025 7:13 AM | Updated on Apr 29 2025 7:13 AM

తాండవ్‌తో బాలికల ఆరోగ్య సంరక్షణ

తాండవ్‌తో బాలికల ఆరోగ్య సంరక్షణ

సాక్షి, చైన్నె: కౌమారదశలో ఉన్న బాలికల ఆరోగ్యం, జీవనశైలి అలవాట్లను హై–ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ (హెచ్‌ఐఐటీ) ఆధారంగా తాండవ్‌ కార్యక్రమం మెరుగు పరుస్తుందని డాక్టర్‌ ఆర్‌.ఎం.మోహన్స్‌ డయాబెటిస్‌ స్పెషాలిటీస్‌ సెంటర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, మద్రాస్‌ డయాబెటిస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ ఆర్‌ఎం అంజనా తెలిపారు. సోమవారం స్థానికంగా తాండవ్‌ అధ్యయనంపై ఆమె వివరించారు. ఈ అధ్యయనం ఫలితాల మేరకు పది నిమిషాల నృత్య వ్యాయామం అయిన తాండవ్‌ ప్రయోజనాలు, కౌమార దశకు సాంస్కృతికంగా రూపొందించబడిన కార్యక్రమంగా పేర్కొన్నారు. శారీరక శ్రమ స్థాయి, గుండె ఆరోగ్యం, మొత్తం శ్రేయస్సులో గణనీయమైన మెరుగుదలను చూపించిందన్నారు. రోజువారీ జీవితంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఆసక్తిని వ్యక్త పరిచిన వారే అధికమని పేర్కొన్నారు. చైన్నెలోని రెండు పాఠశాలల్లో 13–15 సంవత్సరాల వయస్సు గల 108 మంది బాలికలపై ఈ అధ్యయనం జరిగిందన్నారు. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ కార్యక్రమం సాధించిన విజయానికి తోడు, సానుకూల ప్రవర్తనా మార్పులను ప్రోత్సహించే సామర్థ్యం కూడా ఉందన్నారు. ఈ అధ్యయనం ఫలితాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, ముఖ్యంగా పెరుగుతున్న అంటువ్యాధి కాని వ్యాధులను ఎదుర్కోవడంలో, కౌమారదశలో ఉన్నవారి దినచర్యలలో శారీరక శ్రమను చేర్చడం కీలకంగా పేర్కొన్నారు. అక్టోబర్‌ 2023లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికే 10,000 మందికి పైగా మహిళలు, బాలికలకు ఈ కార్యక్రమం ప్రయోజనం చేకూర్చినట్టు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement