లైకా ఖాతాలో.. అరుణ్‌ విజయ్‌ చిత్రం | - | Sakshi
Sakshi News home page

లైకా ఖాతాలో.. అరుణ్‌ విజయ్‌ చిత్రం

Apr 9 2023 2:12 AM | Updated on Apr 9 2023 2:12 AM

- - Sakshi

తమిళసినిమా: భారీ చిత్రాలతో పాటు మంచి కథా బలం ఉన్న సినిమాలను నిర్మిస్తూ విజయాలను సాధిస్తున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్‌. ఈ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రాల్లో అజిత్‌ 62వ సినిమా కూడా ఉంది. కాగా ఇతర నిర్మాతల చిత్రాలను ఈ సంస్థ విడుదల చేయడం విశేషం.

అలా తాజాగా నటుడు అరుణ్‌విజయ్‌, నటి ఎమిజాక్సన్‌ జంటగా నటించిన మిషన్‌ చాప్టర్‌ –1. అచ్చం ఎంబదు ఇళ్‌లైయే చిత్ర విడుదల హక్కులను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తన ఖాతాలో వేసుకుంది. విజయ్‌ దర్శకత్వం వహించిన చిత్రం మిషన్‌ చాప్టర్‌–1. అచ్చం ఎంబదు ఇళ్‌లైయే. నటి నిమిషా సజయన్‌, అభిహాసన్‌, భరత్‌ బొప్పన్న, బేబి ఇయల్‌, విరాజ్‌ ఎస్‌, జసన్‌షా తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎం.రాజశేఖర్‌, ఎస్‌.స్వాతి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని, సందీప్‌ కె. విజయ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను లైకా సంస్థ నిర్వాహకులు తెలుపుతూ అన్ని వర్గాలను అలరించే అంశాలు చోటు చేసుకోవడంతో ఈ చిత్రాన్ని తాము ఇతర భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు విజయ్‌ ప్రతిభ కలిగిన వ్యక్తి అని, చిత్ర షూటింగ్‌ను చైన్నె, లండన్‌ ప్రాంతాలలో 70 రోజుల్లో నిర్వహించి పూర్తి చేశారని ప్రశంసించారు. చిత్రంలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తుందని కాగా త్వరలోనే చిత్ర ట్రైలర్‌ ఆడియో ఆవిష్కరణ తేదీని అదే విధంగా చిత్ర విడుదల తేదీని అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు.

దర్శకుడు విజయ్‌తో నటి ఎమిజాక్సన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement