వెలుగుల చామంతి
గాండ్లపెంట: విద్యుత్ వెలుగుల కాంతిలో చామంతి పూల సాగు చేపట్టి గాండ్లపెంట మండలం ద్వారనాల గ్రామానికి చెందిన రైతు శ్రీనాథ్‌రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. గ్రామ సమీపంలో కదిరి – రాయచోటి ప్రధాన రహదారి పక్కన తనకున్న ఐదు ఎకరాల్లో ఆయన చామంతి పూల సాగుచేపట్టాడు. బెంగళూరు రూరల్ పరిధిలోని ఆనేకల్లు ప్రాంతం నుంచి ఒక్కో మొక్కను రూ.1.50 నుంచి రూ.3 వరకూ వెచ్చించి కొనుగోలు చేశాడు. పంట సాగులో వినూత్న పద్ధతులు అవలంభించడంతో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పంటను హైదరాబాద్, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నాడు.
కృత్రిమ కాంతితో సత్ఫలితాలు
సాధారణంగా చామంతి మొక్క ఏపుగా ఎదిగి అధిక దిగుబడి ఇవ్వాలంటే రోజుకు 14 గంటల వెలుగు ఉండాలి. అయితే శీతాకాలంలో పగటి సమయం తక్కువగా ఉండడంతో రైతు శ్రీనాథ్‌రెడ్డి తన పొలంలో చేపట్టిన చామంతి సాగులో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలను అమర్చాడు. పగటి వేళ సూర్య కాంతితో పాటు రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగు కారణంగా మొక్క నాటిన నెల రోజులకే ఒకటిన్నర ఎత్తుకు ఏపుగా పెరిగి నెలన్నరకే పంట కోతకు వచ్చింది. ఆ తర్వాత విద్యుత్ బల్బులు తొలగించేశాడు. ఈ విధానం ద్వారా నాలుగు నుంచి ఆరు నెలల వరకూ అధిక దిగుబడి వచ్చింది. ఎలాంటి రసాయనిక ఎరువుల అవసరం ఉండదు. పశువుల పేడ ఎరువు మాత్రమే వినియోగిస్తే చాలు. నీటి తడులు కూడా చాలా తక్కువ. దీంతో పెట్టుబడుల భారం కూడా తగ్గింది.
విద్యుత్ వెలుగుల్లో పూలసాగు
ద్వారనాల రైతు వినూత్న పద్ధతులు
పొరుగు రాష్ట్రాల మార్కెట్‌కు తరలిస్తా
విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం ద్వారా మొక్క నాటిన నెలన్నరకే ఏపుగా పెరిగి పూలు కోతకు వస్తాయి. ఆ సమయంలో విద్యుత్ దీపాలను తొలగించేస్తా. ఎకరాకు 4 టన్నుల నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దిగుబడిని తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలకు పంటను తరలిస్తా.
– శ్రీనాథ్‌రెడ్డి, రైతు, ద్వారనాల
వెలుగుల చామంతి


