
ఆసియాకప్-2025 టీ20 టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మార్క్యూ ఈవెంట్ కోసం భారత జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.
అయితే ఈ టోర్నీకి భారత జట్టులో యవ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చోటు ఇవ్వాలని లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ సూచించాడు. కాగా టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాక టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్లగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కొనసాగుతున్నారు.
చాలా టీ20 మ్యాచ్‌లకు జైశ్వాల్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఇప్పుడు ఆసియాకప్‌నకు జైశ్వాల్‌తో పాటు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. దీంతో భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
"ఆసియాకప్ జట్టు ఎంపిక గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో యశస్వి జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్నందున, శుబ్‌మన్ గిల్‌ను టీ20 ప్రణాళికలకు సరిపోతాడా లేదా అన్నది ఇప్పుడు అందరి మనస్సులను తొలుస్తున్న ప్రశ్న.
నావరకు అయితే సెలక్టర్లు గిల్ కంటే జైశ్వాల్‌కే తొలి ప్రధాన్యత ఇస్తారని అనుకుంటున్నాను. రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ స్దానంలో జైశ్వాల్ ఆటోమేటిక్‌గా లభిస్తుంది. అభిషేక్ శర్మ స్దానానికి ఎటువంటి ఢోకా లేదు.
ఇప్పుడంతా మరో ఓపెనర్ కోసమే చర్చ. శుబ్‌మన్ గిల్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదేవిధంగా సంజూ శాంసన్ కూడా ఓపెనర్‌గా అద్బుతంగా రాణించాడు. కాబట్టి సెలెక్టర్లకు కష్టమైన పరిస్థితి" అని ఎక్స్‌ప్రెస్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2025: పాక్-భారత్ మ్యాచ్‌కు భారీ డిమాండ్.. 10 సెకన్లకు రూ.16 లక్షలు!