భారత్‌పై పాకిస్తాన్‌ ఘన విజయం.. ఫైనల్‌కు!

Triangular Blind T20 tournament: Pakistan beat India and qualify for final - Sakshi

యూఏఈ వేదికగా జరుగుతోన్న ముక్కోణపు అంధుల  టీ20 టోర్నమెంట్‌లో భారత్‌పై ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్  మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పాకిస్తాన్ బ్యాటర్లు బదర్ మునీర్(64), రషీద్‌(64) పరుగులతో జట్టు విజయంలో  కీలకపాత్ర పోషించారు.  అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.

భారత బ్యాటర్లలో కెప్టెన్‌ ప్రకాష్ జయరామయ్య 79 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక ఈ విజయంతో టోర్నమెంట్‌లో పాక్‌ ఫైనల్‌కు చేరుకుంది. అదే విధంగా భారత్‌.. బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు అయితే విజయం సాధిస్తుందో ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో 64 పరుగులతో రాణించిన బదర్ మునీర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

చదవండి: Ranji Trophy 2022: ధోని హోం టీమ్‌ ప్రపంచ రికార్డ్.. ఏకంగా 1008 పరుగుల ఆధిక్యం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top