PV Sindhu: పతకానికి ఒక్కడుగు దూరంలో పీవీ సింధు | Tokyo Olympics: PV Sindhu Enters Into Semi Final Beat Yamaguchi | Sakshi
Sakshi News home page

Tokyo Olympics 2020: సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

Jul 30 2021 3:08 PM | Updated on Jul 30 2021 9:13 PM

Tokyo Olympics: PV Sindhu Enters Into Semi Final Beat Yamaguchi - Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌ మహిళల బ్యాడ్మింటన్ పోటీల్లో తెలుగు తేజం పీవి సింధు అద్భుత ప్రదర్శనలతో విజయ పరంపర కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన యమగూచిపై  21-13, 22-20తో విజయం సాధించింది. తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ 21-13 తో  మ్యాచ్ ను కైవసం చేసుకున్న సింధూకు రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 

యమగూచి లాంగ్ ర్యాలీలు ఆడుతూ సింధూని బాగా అలిసిపోయేలా చేసి పాయింట్లను సాధించింది . ఒకానొక దశలో 6 పాయింట్ల వెనుకంజలో ఉన్నయమగూచి... సింధూని దాటేసింది. కానీ చివర్లో పుంజుకున్న సింధు రెండు గేమ్ పాయింట్స్‌ని సేవ్‌ చేసి గేమ్‌తో పాటుగా మ్యాచ్ ని కూడా కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement