IPL 2022 - Ravindra Jadeja: ఐపీఎల్‌ 2022 సీజన్‌ నుంచి తప్పుకోనున్న జడేజా..?

Ravindra Jadeja Likely To Be Ruled Out Of Remainder IPL 2022 Says Report - Sakshi

Ravindra Jadeja Likely To Be Ruled Out: ఐపీఎల్ 2022 సీజన్‌ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ తాజా మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా తప్పుకోనున్నాడని తెలుస్తోంది. గాయం కారణంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆడని జడ్డూ.. ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడని ఓ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ వెల్లడించింది. 

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ జడ్డూకి ఛాతీపై గాయాలయ్యాయని, అందుకే అతను ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదని, గాయం తీవ్రత తగ్గకపోగా, రెట్టింపు కావడంతో సీఎస్‌కే లీగ్‌ దశలో ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్‌లకు (ముంబై, గుజరాత్‌, రాజస్థాన్‌) అతను అందుబాటులో ఉండటం అనుమానమేనని సదరు వెబ్‌సైట్‌ పేర్కొంది. 

కాగా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఈ సీజన్‌ బరిలోకి దిగిన సీఎస్‌కే.. వరుస పరాజయాలు ఎదుర్కొని ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దాదాపుగా చేజార్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే తదుపరి ఆడబోయే 3 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ఆర్సీబీ (2), రాజస్థాన్‌ (3) జట్లు లీగ్‌ దశలో ఆడబోయే తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఈ సమీకరణలు వర్కౌటైతే తప్ప సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపుగా అసాధ్యం. కాగా, ప్రస్తుత సీజన్‌ ప్రారంభానికి ముందు ధోని నుంచి సీఎస్‌కే సారధ్య బాధ్యతలు దక్కించుకున్న జడ్డూ.. జట్టును సమర్ధవంతంగా నడిపించలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే.  
చదవండి: సీఎస్‌కే, రవీంద్ర జడేజా మధ్య విబేధాలు.. ఎస్‌ఆర్‌హెచ్‌ బాటలోనేనా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-05-2022
May 11, 2022, 17:39 IST
AB De Villiers Return To RCB Next Season: మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ఆటగాడు, సౌతాఫ్రికన్‌ లెజెండరీ బ్యాటర్‌...
11-05-2022
May 11, 2022, 13:52 IST
సీఎస్‌కే యాజమాన్యం, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాల మధ్య విబేధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని స్థానంలో జట్టును నడిపించడంలో విఫలమైన...
11-05-2022
May 11, 2022, 12:36 IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లే ఆఫ్‌ చేరిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన...
11-05-2022
May 11, 2022, 09:03 IST
ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ 2022 సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ముంబై...
11-05-2022
May 11, 2022, 08:23 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 62 పరుగుల తేడాతో ఘన విజయం...
11-05-2022
May 11, 2022, 05:29 IST
పుణే: పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోరు... ఎవరిది పైచేయి అవుతుందో తేల్చే మ్యాచ్‌లో...
10-05-2022
10-05-2022
May 10, 2022, 18:31 IST
ఐపీఎల్‌-2022లో హార్ధిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో...
10-05-2022
May 10, 2022, 18:10 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో అన్నాదమ్ముల జట్లు రెండోసారి ఎదురెదురుపడనున్నాయి. హార్ధిక్‌ పాండ్యా నాయకత్వం వహిస్తున్న గుజరాత్‌ టైటాన్స్‌.. కృనాల్‌ పాండ్యా...
10-05-2022
May 10, 2022, 17:46 IST
ఐపీఎల్‌-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్‌ హిట్టర్‌ రోవ్‌మెన్‌ పావెల్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆరంభ మ్యాచ్‌లలో పావెల్‌ విఫలమైనా.. తర్వాత మ్యాచ్‌ల్లో...
10-05-2022
May 10, 2022, 16:47 IST
వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు షిమ్రన్‌ హెట్‌మైర్‌ తండ్రైన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్‌-2022లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెట్‌మైర్‌...
10-05-2022
May 10, 2022, 14:41 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టాప్‌ టు జట్ల మధ్య ఇవాళ (మే...
10-05-2022
May 10, 2022, 13:30 IST
టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్‌ 2022 సీజన్‌లో బిజీగా ఉన్నారు. ఆఖరి అంకానికి చేరుకున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌ మే...
10-05-2022
May 10, 2022, 13:30 IST
విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చిన బుమ్రా.. నేను వాటిని అసలు లెక్కచేయను!
10-05-2022
May 10, 2022, 12:58 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. లీగ్‌ ప్రారంభమై 15 ఏళ్లు గడుస్తున్నా ఆ జట్టు...
10-05-2022
May 10, 2022, 12:40 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పడుతూ లేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్‌...
10-05-2022
May 10, 2022, 11:27 IST
IPL 2022 KKR Vs MI- Rohit Sharma Comments: ‘‘మా బౌలింగ్‌ విభాగం రాణించింది. బుమ్రా మరింత ప్రత్యేకం....
10-05-2022
May 10, 2022, 11:18 IST
ఐపీఎల్‌ 2022లో సోమవారం ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్‌ 52 పరుగుల సూపర్‌ విక్టరీ సాధించింది. తద్వారా తమ ప్లే ఆఫ్‌...
10-05-2022
May 10, 2022, 10:25 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఏది కలిసిరావడం లేదు. ఘోర ప్రదర్శనతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు దూరమైన ముంబై...
10-05-2022
May 10, 2022, 09:06 IST
ఐపీఎల్‌ 2022లో ​భాగంగా ముంబై ఇండియన్స్‌, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంతి కనిపించకపోవడంతో ఇషాన్‌... 

Read also in:
Back to Top