
టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడ్డూ.. ధ్రువ్ జురెల్‌తో కలిసి స్కోర్‌ను బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.
59 పరుగులతో జడేజా తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. జడేజాకు ఇది టెస్టుల్లో 28 హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అదేవిధంగా జడేజా చివరి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో ఇది ఏడో ఫిప్టీ కావడం విశేషం. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో కూడా జడేజా దుమ్ములేపాడు. మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జడ్డూ సెంచరీ కూడా సాధించాడు.
2025 ఏడాదిలో టెస్టుల్లో జడేజా సగటు 75పైగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు 605 పరుగులు చేశాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ హిస్టరీలో జడేజా 45 మ్యాచ్‌లు ఆడి 43 సగటుతో 2451 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
కపిల్ దేవ్ రికార్డు బ్రేక్..
ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన జడేజా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో ఐదు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించాడు. జడేజా ఇప్పటివరకు 28 హాఫ్ సెంచరీలు చేశాడు.
ఇంతకుముందు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్(27) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డును ఈ సౌరాష్ట్ర క్రికెటర్ బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వీవియస్ లక్ష్మణ్(40) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో ధోని(32), సౌరవ్ గంగూలీ(29) కొనసాగుతున్నాడు.
అదేవిధంగా టెస్టుల్లో అత్యధిక సిక్సర్ల బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనిని జడేజా అధిగమించాడు. ధోని తన కెరీర్‌లో 78 టెస్టు సిక్సర్లు బాదగా.. జడేజా 79 కొట్టాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తొలి స్ధానంలో ఉన్నారు. సెహ్వాగ్ తన కెరీర్‌లో 91 సిక్సర్లు బాదగా.. పంత్ కూడా సరిగ్గా 90 సిక్సర్లు కొట్టాడు.
టెస్టుల్లో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
రిషబ్ పంత్ – 47 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు
వీరేంద్ర సెహ్వాగ్ – 103 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు
రోహిత్ శర్మ – 67 మ్యాచ్‌ల్లో 88 సిక్సర్లు
రవీంద్ర జడేజా – 86 మ్యాచ్‌ల్లో 79 సిక్సర్లు
ఎంఎస్ ధోని – 90 మ్యాచ్‌ల్లో 78 సిక్సర్లు
చదవండి: IND vs AUS: ఆసీస్‌పై అభిషేక్ శర్మ ఫెయిల్.. తొలి బంతికే ఔట్