స్మిత్‌కు అశ్విన్‌ ఝలక్‌.. కోహ్లి చర్య వైరల్‌

R Ashwin Rattles Steve Smith At-Non-Strikers End Kohli Reaction Viral - Sakshi

టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆసీస్‌ వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మి్త్‌కు ఝలక్‌ ఇచ్చాడు. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్లను రనౌట్‌(మన్కడింగ్‌) చేసే చాన్స్‌ అశ్విన్‌ తప్ప మరెవరు తీసుకోవడం లేదనుకుంటా. తాజాగా స్టీవ్‌ స్మిత్‌ను మన్కడింగ్‌ చేసే ప్రయత్నం చేశాడు అశ్విన్‌.. అయితే ఇది సరదాకు మాత్రమే.

ఇన్నింగ్స్‌ 15 ఓవర్లో క్రీజులో లబుషేన్‌ ఉన్నాడు. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో స్మిత్‌ ఉన్నాడు. బౌలింగ్‌ యాక్షన్‌ కంప్లీట్‌ చేసినప్పటికి అశ్విన్‌ బంతిని విడువలేదు. అయితే అలర్ట్‌ అయిన స్మిత్‌ తన బ్యాట్‌ను క్రీజుపై ఉంచాడు. నిజానికి అశ్విన్‌ స్మిత్‌ను మన్కడింగ్‌ చేయాలనుకోలేదు. బంతి పట్టు తప్పినట్లు అనిపించడంతో అశ్విన్‌ డెలివరీని విడుదల చేయలేదు. ఇదే విషయం అంపైర్‌కు వివరించాడు.

దీంతో క్రీజులో ఉన్న లబుషేన్‌ నవ్వాడు.. స్మిత్‌ కూడా  నేను అలర్ట్‌గానే ఉన్నా అంటూ చేతితో సిగ్నేచర్‌  ఇవ్వడం ఆసక్తి కలిగించింది. కానీ ఇక్కడ హైలైట్‌ అయింది మాత్రం స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి చర్య. అశ్విన్‌ చేసిన పనికి నవ్వాపుకోలేకపోయిన కోహ్లి తన రెండు చేతులతో గట్టిగా క్లాప్స్‌ కొడుతూ.. భలే ఝలక్‌ ఇచ్చావుగా అన్నట్లు ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గి నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. 115 స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన  టీమిండియా 26. 4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. చతేశ్వర్‌ పూజారా(31), శ్రీకర్‌ భరత్‌(23) ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు.  అంతకముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో 7 వికెట్లతో రవీంద్ర జడేజా ఆసీస్‌ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అశ్విన్‌ మూడు వికెట్ల పడగొట్టాడు. ఆసీస్‌ బ్యాటర్లో హెడ్‌ 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 263 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ 262 పరుగులు చేసింది.

చదవండి: ప్రత్యర్థి కెప్టెన్‌ నుంచి మరిచిపోలేని గిఫ్ట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top