IPL 2022 Auction- Avishka Fernando: 23 బంతుల్లో 53 పరుగులు.. సిక్సర్ల కింగ్‌.. ఐపీఎల్‌ వేలంలోకి వచ్చాడంటే!

IPL 2022: Sri Lanka New SIXER KING Avishka Fernando May Break Bank In Auction - Sakshi

IPL 2022: Sri Lanka New SIXER KING Avishka Fernando May Break Bank In Auction: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫ్రాంఛైజీలు రిటెన్షన్‌ ఆటగాళ్ల జాబితా సమర్పించగా... కారణాలేవైనా డేవిడ్‌ వార్నర్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, రషీద్‌ ఖాన్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లను వదిలేశాయి. వీళ్లంతా వేలంలోకి వస్తే కొనడానికి పలు ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయి కూడా. అదే సమయంలో.. టీ20 వరల్డ్‌కప్‌-2021 హీరోలు, ఇతర లీగ్‌ మ్యాచ్‌లలో అదరగొడుతున్న ఆటగాళ్లపై కూడా దృష్టిసారించాయనడంలో సందేహం లేదు.

ఈ నేపథ్యంలో లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలంక క్రికెటర్‌ అవిష్క ఫెర్నాండో ఈసారి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమే అంటున్నారు క్రీడాభిమానులు. ఇప్పటికే వనిందు హసరంగ, దుష్మంత చమీరా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో భాగం కాగా.. 23 ఏళ్ల అవిష్క ఫెర్నాండో కూడా ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లంక ప్రీమియర్‌లో అతడి సిక్సర్ల ప్రదర్శన చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది మరి! 

ఈ లీగ్‌లో జఫ్నా కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న  అవిష్క.. కాండీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వరుస సిక్సర్లు బాదాడు. 23 బంతుల్లోనే 53 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 7 సిక్స్‌లు కొట్టి ఎల్‌పీఎల్‌ మ్యాచ్‌లో రెండుసార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు. అంతేగాక ఇతర మ్యాచ్‌లలోనూ తనదైన శైలిలో హిట్టింగ్‌ ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. 

మరి ఇలాంటి పవర్‌ఫుల్‌ హిట్టర్‌ ఐపీఎల్‌లోనూ ఆడితే బాగుంటుందని ఫ్యాన్స్‌ అంటున్నారు.  కొత్త ఫ్రాంఛైజీలు లక్నో, అహ్మదాబాద్‌ అతడిని కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.  ఇప్పటి వరకు 74 టీ20లు ఆడిన అవిష్క 1600కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 12 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరోవైపు.. టీ20 వరల్డ్‌కప్‌-2021లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వనిందు హసరంగ, చరిత్‌ అసలంక కోసం ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశం ఉంది. 
చదవండి: IPL 2022 Mega Auction: ఈ నలుగురు క్రికెటర్లు అమ్ముడుపోవడం కష్టమే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top