ఆర్సీబీ ఫస్ట్‌ ప్రాక్టీస్‌ వీడియో.. రజత్‌ పాటిదార్‌ హాఫ్‌ సెంచరీ | IPL 2021: RCBs New Recruits Shine In First Practice Game | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ ఫస్ట్‌ ప్రాక్టీస్‌ వీడియో.. రజత్‌ పాటిదార్‌ హాఫ్‌ సెంచరీ

Apr 4 2021 5:00 PM | Updated on Apr 4 2021 8:05 PM

IPL 2021: RCBs New Recruits Shine In First Practice Game - Sakshi

రజత్‌ పాటిదార్‌(ఫోటో సోర్స్‌-ఆర్సీబీ ట్వీటర్‌)

చెన్నై:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఇప్పటికీ టైటిల్‌ అందుకోని జట్లలో రాయల్‌ చాలెంజర్స్‌  బెంగళూరు(ఆర్సీబీ) ఒకటి. గత సీజన్‌లో ఆర్సీబీ ఫర్వాలేదనిపించినా టైటిల్‌ రేసు వరకూ వెళ్లలేకపోయింది. ఈసారి కప్‌ నమ్‌దే అంటూ మరొకసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది కోహ్లి నేతృత్వంలోని ఆర్సీబీ. ఈసారి ఆర్సీబీ జట్టు కాస్త బలంగానే కనబడుతోంది.  ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఆర్సీబీ కొంతమంది స్టార్‌ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మహ్మద్‌ అజహరుద్దీన్‌, కేల్‌ జెమీసన్‌లతో ఆ జట్టు మరింత బలోపేతమైంది. 

ఈ నెల9 వ తేదీన ఆరంభమయ్యే ఐపీఎల్‌-14 సీజన్‌లో భాగంగా  ఆర్సీబీ-ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.  చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. కాగా, ఆర్సీబీ తన ప్రాక్టీస్‌ వీడియోను ట్వీటర్‌లో షేర్‌ చేసింది. ఆ జట్టు రెండుగా విడిపోయి సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేసిన ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. ‘ బోల్డ్‌ డయరీస్‌: ఆర్సీబీ ఫస్ట్‌ ప్రాక్టీస్‌ వీడీయో, ఐపీఎల్‌ 2021’ అంటూ ట్వీట్‌ చేసింది. ఇందులో రజత్‌ పాటిదార్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడని, యజ్వేంద్ర చహల్‌ స్పెల్‌ ఆకట్టుకుందని, హర్షల్‌ పటేల్‌ ఆల్‌రౌండ్‌ షో లు ఇవిగో అంటూ వీడియోను పోస్ట్‌ చేసింది. 

ఇక్కడ చదవండి: మా మాజీ మచ్చి.. మాపై ఎందుకు అలా‌?: సీఎస్‌కే కౌంటర్‌

ఆ జెర్సీ వేసుకోలేను.. ఓకే చెప్పిన సీఎస్‌కే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement