DC Vs RR IPL 2021 2nd Phase: రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి.. ప్లేఆఫ్‌కు చేరువగా ఢిల్లీ

IPL 2021 Delhi Capitals Vs Rajastan Royals Match Live Updates Highlights - Sakshi

ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయడంతో 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఆరో వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌ రాయల్స్‌.. 99/6
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఓటమికి మరింత చేరువైంది. రాహుల్‌ తెవాటియా(9) రూపంలో రాయల్స్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ ప్రస్తుతం ఆరు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఆర్‌ఆర్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌(52, 41 బంతులు; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

ఓటమి దిశగా రాజస్తాన్‌.. 56 పరుగులకే 5వికెట్లు
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  రాజస్తాన్‌ ఓటమి దిశగా పయనిస్తుంది. కేవలం 56 పరుగులకే 5 వికెట్లు పీకల్లోతు కష్టాల్లో పడింది. 56 పరుగుల వద్ద రియాన్‌ పరాగ్‌(2) ఆక‌్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. కాగా ప్రస్తుతం రాజస్తాన్‌ 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. శాంసన్ (27), రాహుల్‌ తెవాటియా(2) క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌..లొమ్రర్(19)ఔట్‌
155 పరుగుల లక్ష్య చేధనలో రాజస్తాన్‌  బ్యాట్స్‌మన్‌లు తడబడుతున్నారు.ఈ క్రమంలో స్కోర్‌ బోర్డు 48 పరుగుల వద్ద రాజస్తాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.  కగిసో రబడ బౌలింగ్‌లో లొమ్రర్(19) ఆవేష్ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  కాగా ప్రస్తుతం రాజస్తాన్‌ 12 ఓవర్లకు 56 పరుగులు చేసింది. శాంసన్ (20), పరాగ్‌(2) క్రీజులో ఉన్నారు.


Photo Courtesy: IPL

మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌.. మిల్లర్‌(7) ఔట్‌
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. స్కోర్‌ బోర్డు 18 పరుగుల వద్ద మిల్లర్‌ (7)వికెట్‌ కోల్పోయింది. ఆశ్విన్‌ బౌలింగ్‌లో  స్టంప్‌ అవుట్‌గా మిల్లర్‌ వెనుదిరిగాడు. కాగా ప్రస్తుతం రాజస్తాన్‌ 7ఓవర్లో 3వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. శాంసన్ (10), మహిపాల్ లొమ్రర్(4)పరుగులుతో క్రీజులో ఉన్నారు.

6 పరుగులకే ఓపెనర్లు ఔట్‌
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ కేవలం 6పరుగులకే ఓపెనర్లుని కోల్పోయింది. ఆవేష్ ఖాన్ వేసిన తొలి ఓవర్‌ అఖరి బంతికి లివింగ్‌స్టన్‌(1) పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిర‌గ‌గా,  అన్రిచ్ నార్త్జే, వేసిన తొలి బంతికే పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి  జైశ్వాల్‌ (5) పెవిలియన్‌కు చేరాడు. కాగా ప్రస్తుతం రాజస్తాన్‌ 2.1 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. శాంసన్ (2), మిల్లర్‌(5)పరుగులుతో క్రీజులో ఉన్నారు.


Photo Courtesy: IPL
రాజస్తాన్‌ టార్గెట్‌ 155 పరుగులు..
రాజస్తాన్‌ జరుగుతున్న మ్యాచ్‌లో  ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్లు ధావన్‌, పృథ్వీ షా ఇద్దరూ విఫలం అయ్యారు. కాగా శ్రేయాస్‌ అయ్యర్‌(43) కెప్టెన్‌ పంత్‌ (24) ఇద్దరూ కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి 60 పరుగుల  భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివర్లో హెట్‌మైర్‌(28) అలరించడంతో  ఢిల్లీ స్కోర్‌ 150 మార్క్‌ దాటింది. ఇక రాజస్తాన్‌ బౌలర్లలో ముస్తఫిజుర్ రహమాన్ 2, చేతన్ సకారియా 2, కార్తీక్‌ త్యాగి,రాహుల్‌ తెవాటియా చెరో  వికెట్‌ సాధించారు.  
ఐదో వికెట్‌ డౌన్‌.. హెట్‌మైర్‌(28) ఔట్‌
రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. వరుస బౌండరీలతో కాసేపు అలరించిన హెట్‌మైర్‌(28) ముస్తఫిజుర్ రహమాన్ బౌలింగ్‌లో చేతన్ సకారియా క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ 17.2 ఓవర్లో ఐదు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.

నాలుగో వికెట్‌ డౌన్‌.. అయ్యర్‌ స్టంప్‌ అవుట్‌
రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 43 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన శ్రెయాస్‌ అయ్యర్‌ రాహుల్‌ తెవాటియా బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. కాగా అయ్యర్‌ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, ఒక ఫోర్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ 13.2 ఓ‍వర్లలో 4 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.

మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. పంత్‌ (24) ఔట్‌
స్కోర్‌ బోర్డు 83 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్‌ కోల్పోయింది.  ముస్తఫిజుర్ రహమాన్ బౌలింగ్‌లో  కెప్టెన్‌ పంత్‌( 24) క్లీన్‌ బౌల్డ్‌ రూపంలో వెనుదిరిగాడు. 13 ఓవర్లో 3 వికెట్లు నష్టపోయి ఢిల్లీ 89 పరుగులు చేసింది. అయ్యర్‌ 43, షిమ్రాన్ హెట్‌మైర్‌ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు.


Photo Courtesy: IPL
రెండో వికెట్‌ కోల్పోయిన పృథ్వీ షా ..(10) ఔట్‌
వరుస క్రమంలో ఢిల్లీ ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్‌ చేరారు. స్కోర్‌ బోర్డు 21 పరుగుల వద్ద  పృథ్వీ షా (10)వికెట్‌ను ఢిల్లీ వికెట్‌ కోల్పోయింది. చేతన్ సకారియా బౌలింగ్‌లో లివింగ్‌స్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి పృథ్వీ షా వెనుదిరిగాడు. ఢిల్లీ 5.2 ఓవర్లలో 2వికెట్లు  నష్టపోయి  31పరుగులు చేసింది. అయ్యర్‌ 9, పంత్‌ (2) పరుగులతో క్రీజులో ఉన్నారు.


Photo Courtesy: IPL

తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ ..ధావన్‌(8) ఔట్‌
ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ తో జరగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీకు ఆదిలోనే ఎదరుదెబ్బ తగిలింది. 18 పరుగుల వద్ద శిఖర్‌ ధావన్‌ (8) వికెట్‌ ఢిల్లీ కోల్పోయింది. కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్ఢ్‌ రూపంలో గబ్బర్‌ పెవిలియన్‌ కు చేరాడు.


Photo Courtesy: IPL

అబుదాబి: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. సెకండ్‌ఫేజ్‌లో ఇరు జట్లు విజయంతో శుభారంభం చేశాయి. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం అందుకోగా.. మరోవైపు రాజస్తాన్‌ రాయల్స్‌ ఆఖరి నిమిషంలో పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచింది. రాజస్థాన్, ఢిల్లీ జట్ల హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 12 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ విజయం సాధించగా.. మిగిలిన 11 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలిచింది.

చివరిగా జరిగిన ఐదు మ్యాచ్‌లకిగానూ ఢిల్లీ టీమ్ నాల్గింటిలో విజయం సాధించగా.. ఇక తొలి అంచె పోటీల్లో ఏప్రిల్ 15న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ ఢిల్లీపై గెలుపొందింది. కాగా రాజస్తాన్‌ జట్టులో ఎవిన్‌ లూయిస్‌, క్రిస్‌ మోరిస్‌ స్థానాల్లో డేవిడ్‌ మిల్లర్‌, తబ్రెయిజ్‌ షంసీ జట్టులోకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో స్టొయినిస్‌ స్థానంలో లలిత్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చాడు.

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌),యశస్వి జైస్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రహమాన్, తబ్రయిజ్‌ షమ్సీ

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, లలిత్ యాదవ్, షిమ్రాన్ హెట్‌మైర్‌, అక్షర్‌ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ, అన్రిచ్ నార్త్జే, ఆవేష్ ఖాన్

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top