
భారత టెస్టు జట్టులో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ లేని లోటును ధ్రువ్ జురెల్ తీర్చాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జురెల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. పంత్ గాయపడంతో తన దక్కిన అవకాశాన్ని జురెల్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 24 ఏళ్ల ఈ యువ ఆటగాడు తన సూపర్ బ్యాటింగ్‌తో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్ 190 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 210 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 125 పరుగులు చేశాడు. జురెల్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు
నో రిషబ్ పంత్.. నో ప్రోబ్లమ్
ధ్రువ్ జురెల్ గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌పై భారత తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్‌లో జురెల్ తన ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నాడు. కానీ రిషబ్ పంత్ రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా ఉండడంతో జురెల్ ఇప్పటివరకు టీమిండియా తరపున కేవలం 6 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టూర్‌లకు జురెల్ జట్టుకు ఎంపికైనప్పటికి ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు కూడా భారత జట్టుతో పాటు జురెల్ వెళ్లాడు. నాలుగో టెస్టులో రిషబ్ పంత్ కాలికి గాయం కావడంతో సబ్‌స్ట్యూట్ వికెట్ కీపర్‌గా ధ్రువ్ బాధ్యతలు చేపట్టాడు.
రెండు ఇన్నింగ్స్‌లలోనూ వికెట్ల వెనక తన సేవలను అందించాడు. ఆ తర్వాత ఐదో టెస్టుకు పంత్ దూరం కావడంతో జురెల్ తుది జట్టులోకి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 19 పరుగులు మాత్రమే చేసిన జురెల్.. రెండో ఇన్నింగ్స్‌లో 34 పరుగులతో కీలక నాక్ ఆడాడు.
ఇప్పుడు విండీస్‌తో సిరీస్‌తో మొత్తానికి పంత్ దూరం కావడంతో జురెల్ రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. విండీస్‌తో తొలి టెస్టులో జురెల్ వికెట్ల వెనక కూడా అద్బుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు. అంతేకాకుండా తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో దాదాపు ఇరవైకి పైగా ఎక్స్‌ట్రా రన్స్‌ను సేవ్ చేశాడు. పంత్ జట్టుకు అందుబాటులో లేక పోయినా ధ్రువ్ జురెల్ రూపంలో భారత్‌కు అద్బుతమైన వికెట్‌కీపర్ ఉన్నాడనే చెప్పుకోవాలి.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గిల్ సేన ప్రస్తుతం 286 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత బ్యాటర్లలో జురెల్‌తో పాటు కేఎల్ రాహుల్(100), రవీంద్ర జడేజా(104 నాటౌట్) సెంచరీలతో మెరిశారు.
చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన జడేజా.. దెబ్బకు కపిల్ దేవ్, ధోని రికార్డులు బ్రేక్