IPL 2022: Harsha Bhogle Scary Instagram Live Video Goes Viral - Sakshi
Sakshi News home page

Harsha Bhogle: ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాతపై దాడి..?

Mar 25 2022 12:33 PM | Updated on Mar 25 2022 1:43 PM

Harsha Bhogle Scary Instagram Live Video Goes Viral - Sakshi

ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షా భోగ్లేపై దాడి జరిగిందన్న వార్త సోషల్‌మీడియాను షేక్‌ చేసింది. క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ అనే ఛానెల్‌తో కలిసి ఐపీఎల్ 2022 సీజన్‌ లైవ్‌ ప్రోగ్రామ్‌ చేస్తుండగా హర్షా అకస్మాత్తుగా స్క్రీన్‌పై కనిపించకుండా పోయాడు. అతనిపై ఎవరో దాడి చేసినట్టు అరుపులు, కేకలు వినిపించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన  వీడియో గురువారం (మార్చి 24) న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.


హర్షా భోగ్లేపై ఎవరు దాడి చేశారు..? ఎందుకు చేశారు..? అని క్రికెట్ అభిమానులు తెగ ఆందోళన పడ్డారు. దీనికి మరింత హైప్‌ పెంచుతూ క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ ఛానెల్.. ‘హర్షా భోగ్లేకి ఏమైందో, అక్కడేం జరిగిందో మాకు తెలీదు. తెలుసుకునేందుకు హర్షా భోగ్లేతో, అతని టీమ్‌తో సంప్రదింపులు చేస్తున్నాం. త్వరలో మీకు సమాచారం ఇస్తాం’ అంటూ ట్వీట్ చేసింది.


కట్‌ చేస్తే.. అసలు హర్షా భోగ్లేపై దాడి జరిగిందన్నది వాస్తవం కాదని, సదరు ప్రోగ్రామ్‌కి హైప్ తెచ్చేందుకు ఆ ఛానెల్ వాళ్లు ప్లే చేసిన చీప్‌ ట్రిక్‌ అని తేలింది. తాజాగా హర్షా ఈ ఎపిసోడ్‌పై స్పందించాడు. ‘నేను క్షేమంగానే ఉన్నాను. ఎవ్వరూ ఆందోళన చెందకండి. వాస్తవానికి నాపై ఎలాంటి దాడి జరగలేదు. సదరు వీడియోలో మేమనుకున్నది ఒకటైతే, మరొకటి జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలని ఇలా చేయలేదు. ఏదిఏమైనప్పటికీ అందరిని క్షమాపణలు కోరుతున్నాను, నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా. మీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. సారీ అండ్ ఛీర్స్ అంటూ ట్వీటర్‌ ద్వారా వివరణ ఇచ్చాడు. 

కాగా, హర్షా భోగ్లే క్రికెట్‌ వ్యాఖ్యానంలో విశ్వవ్యాప్తంగా అభిమానులను కలిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన భోగ్లే తెలుగులో సైతం అనర్గళంగా మాట్లాడగలడు. దీంతో అతనికి తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. 
చదవండి: IPL 2022: వేలంలో రికార్డు ధర పలికే భారత ఆటగాళ్లు ఆ ఇద్దరే..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement