#Hardik-Krunal: అన్నదమ్ముళ్ల అనుబంధం.. 'నాన్న గర్వంగా ఫీలయ్యేవారు'

Hardik Pandya Said Our Father Would Definitely Proud Emotional Moment - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌కు హార్దిక్‌ పాండ్యా నేతృత్వం వహించగా.. గాయంతో కేఎల్‌ రాహుల్‌ దూరం కావడంతో కృనాల్‌ లక్నో జట్టు నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు.  ఐపీఎల్‌ చరిత్రలో ఇద్దరు అన్నదమ్ములు కెప్టెన్‌లుగా వ్యవహరించడం ఇదే తొలిసారి. 

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు హార్దిక్‌, కృనాల్‌లు ఒకరినొకరు అభినందించుకున్నారు. అనంతరం హార్దిక్‌.. కృనాల్‌ క్యాప్‌ను సరిచేసి అతన్ని హగ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపు ముచ్చటించుకున్న ఇద్దరు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పుకున్నారు. పాండ్యా బ్రదర్స్‌ మధ్య జరిగిన సంభాషణను ఇరుజట్ల ఆటగాళ్లు వీక్షించడం కనిపించింది.

దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు..'' అన్నదమ్ముళ్ల అనుబంధం.. మా దిష్టే తగిలేలా ఉంది.'' అంటూ కామెంట్‌ చేశారు.
 
ఇక టాస్‌ సమయంలోనూ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఈరోజు మా ఇద్దరిని ఇలా చూసి నాన్న గర్వంగా ఫీలయ్యేవాడు. మేమిద్దరం రెండు వేర్వేరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించడం సంతోషంగా ఉంది. నిజంగా ఇది మా కుటుంబానికి మంచి ఎమోషనల్‌ మూమెంట్‌'' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: నక్క తోక తొక్కిన పాండ్యా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top