బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి విజేత లెక్‌లెర్క్‌ | Bahrain Grand Pre: Ferrari Charles Leclerc Won GP | Sakshi
Sakshi News home page

బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి విజేత లెక్‌లెర్క్‌

Mar 21 2022 7:27 AM | Updated on Mar 21 2022 7:33 AM

Bahrain Grand Pre: Ferrari Charles Leclerc Won GP - Sakshi

క్వాలిఫయింగ్‌ సెషన్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు ఫెరారీ జట్టు డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌. ఆదివారం జరిగిన ఫార్ములావన్‌ సీజన్‌ తొలి రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు.

నిర్ణీత 57 ల్యాప్‌లను లెక్‌లెర్క్‌ ఒక గంట 37 నిమిషాల 33.584 సెకన్లలో పూర్తి చేసి కెరీర్‌లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీకే చెందిన కార్లోస్‌ సెయింజ్‌ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ 54వ ల్యాప్‌లో వైదొలిగాడు.


 

Advertisement
 
Advertisement
Advertisement