
భవిషత్ తరాల కోసం నాటుదాం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): మొక్కలు నాటడం అంటే ఎంతో ఇష్టం. ఆయనే తెల్లాపూర్ జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట భాస్కర్. నిత్యం పాఠశాలలో పర్యావరణంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు పాఠశాల ఆవరణలో 350 మొక్కలు నాటారు. గతంలో ఆయన ఎద్దుమైలారం పాఠశాలలో పని చేసిన సమయంలో 400 మొక్కలు నాటి కలెక్టర్ నుంచి గ్రీన్ స్కూల్ అవార్డును సైతం తీసుకున్నారు. భవిష్యత్ తరాల వారికి మంచి వాతావరణం ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నారు.