
కిక్ బాక్సింగ్‌లో సత్తా చాటిన విద్యార్థులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయిలో జగదేవ్‌పూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని ప్రిన్సిపాల్ స్లీవరాజ్ తెలిపారు. బుధవారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. గత నెల 28, 29 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో 46 కిలోల విభాగంలో 8వ తరగతి చదువుతున్న ఆర్ చందన సిల్వర్ మెడల్, 32 కిలోల విభాగంలో 8వ తరగతి చదువుతున్న జ్యోష్న్ట సిల్వర్ మెడల్, 50 కేజీల మ్యూజికల్ పామ్ విభాగంలో ఇంటర్ విద్యార్థి మధులత బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులను, పీఈటీ చారిని ఉపాధ్యాయుల బృందం అభినందించింది.