బీజేపీ మెదక్‌ ఇన్‌చార్జిగా బొక్క నర్సింహారెడ్డి | - | Sakshi
Sakshi News home page

బీజేపీ మెదక్‌ ఇన్‌చార్జిగా బొక్క నర్సింహారెడ్డి

Dec 1 2025 9:54 AM | Updated on Dec 1 2025 9:54 AM

బీజేప

బీజేపీ మెదక్‌ ఇన్‌చార్జిగా బొక్క నర్సింహారెడ్డి

బీజేపీ మెదక్‌ ఇన్‌చార్జిగా బొక్క నర్సింహారెడ్డి సాఫ్ట్‌బాల్‌ విజేతగా జిల్లా జట్టు చుక్కేసి.. చిక్కారు పేదల భూములు లాక్కోవద్దు

కందుకూరు: బీజేపీ మెదక్‌ జిల్లా ఇన్‌చార్జిగా మండల పరిధిలోని కొత్తగూడకు చెందిన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ ఆదివారం ఆయన్ని ఎన్నుకుని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.

ఇచ్చోడ: 12వ రాష్ట్రస్థాయి సీనియర్‌ పురుషుల సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో 7–2తో మహబూబ్‌నగర్‌పై ఘన విజయం సాధించింది. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 జట్లు పాల్గొన్నాయి. విజేత జట్టుకు కప్‌తోపాటు బంగారు పతకం, ద్వితీయస్థానంలో నిలిచిన మహబూబ్‌నగర్‌ రజతం సాధించింది. హన్మకొండ జట్టు 4–3తో హైదరాబాద్‌పై గెలిచి తృతీయస్థానంలో నిలువగా కన్సోలేషన్‌ బహుమతి పొందింది. గెలుపొందిన జట్లకు జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీనివాస్‌ బహుమతులు ప్రదానం చేశారు. సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆప్‌ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, తెలంగాణ అధ్యక్షుడు అభిషేక్‌ గౌడ్‌, అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్‌, జిల్లా కార్యదర్శి గంగాధర్‌, శిక్షకులు చిన్నికృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిన 431 మంది మందుబాబులు

సాక్షి, సిటీబ్యూరో: మందుబాబులు మారడంలేదు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీరికి చెక్‌ పెట్టేందుకు సైబరాబాద్‌ పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మార్పు రావడం లేదు. నవంబర్‌ 24 నుంచి 29 వరకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కమిషనరేట్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనం నడుపుతూ 431 మంది పోలీసులకు పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేశారు. 325 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది ఆటోలు, 86 మంది కార్లు, నలుగురు భారీ వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాముల ఆల్కహాల్‌ ఉంటే అది ఉల్లంఘన. దీన్ని సాంకేతికంగా బ్లడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌ (బీఏసీ) అంటారు. 378 మందికి 35–200 మధ్య, 42 మందికి 200–300 మధ్య, 11 మందికి 300–500 మధ్య బీఏసీ కౌంట్‌ వచ్చిందని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భాస్కర్‌

షాబాద్‌: పేదల భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కడిగాళ్ల భాస్కర్‌ హెచ్చరించారు. ఆదివారం మండల పరిధిలోని రేగడిదోస్వాడ, మక్తగూడ గ్రామాల అసైన్డ్‌ భూమి పేద రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల దగ్గర భూములు లాక్కొని బడా పెట్టుబడిదారులకు ఇవ్వాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అసైన్డ్‌ భూములకు శాశ్వత పట్టాలిస్తామని హామీని నెరవేర్చాలన్నారు. రేగడిదోస్వాడ, మక్తగూడ, వెంకమ్మగూడ, తాళ్లపల్లి గ్రామాల పరిధిలోని 102 సర్వే నంబర్లు రైతులందరికీ శాశ్వత పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం చేవెళ్ల డివిజన్‌ కార్యదర్శి అల్లి దేవేందర్‌, మాజీ సర్పంచులు రాములు, శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, రైతులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

బీజేపీ మెదక్‌ ఇన్‌చార్జిగా బొక్క నర్సింహారెడ్డి 
1
1/2

బీజేపీ మెదక్‌ ఇన్‌చార్జిగా బొక్క నర్సింహారెడ్డి

బీజేపీ మెదక్‌ ఇన్‌చార్జిగా బొక్క నర్సింహారెడ్డి 
2
2/2

బీజేపీ మెదక్‌ ఇన్‌చార్జిగా బొక్క నర్సింహారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement