‘కొత్త’ కిక్కు!
ఎకై ్సజ్ డివిజన్ మద్యం దుకాణాలు
శంషాబాద్ 111
సరూర్‌నగర్ 138
షాద్‌నగర్: ప్రభుత్వం ఏ శుభ సమయాన కొత్త వైన్స్‌లకు అనుమతులు మంజూరు చేసిందో కానీ ప్రస్తుతం వ్యాపారుల పంట పండింది. కొత్త మద్యం పాలసీ ప్రారంభమయ్యే సమయానికే సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో అమ్మకాలు జోరుగా సాగనున్నాయి. ఎన్నికల సమయంలో పారే మద్యం బహిరంగ రహస్యమే. 2025–27 సంవత్సరానికి కేటాయించిన నూతన మద్యం షాప్‌లు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేలోపు మద్యం దుకాణాలకు కిక్కేకిక్కు.
పాత దుకాణాలకు ముగిసిన గడువు
రెండేళ్ల కాలపరిమితికి ఎకై ్సజ్ శాఖ ఇటీవల టెండర్లు పిలిచి డ్రా పద్ధతిన మద్యం దుకాణాలు కేటాయించిన విషయం తెలిసిందే. పాత షాప్‌లకు నవంబర్ 30తో గడువు ముగిసింది. కొత్తగా టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు ఎకై ్సజ్ అధికారులకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి షాప్‌ల నిర్వహణకు లైసెన్స్‌లు పొందారు.
ఎన్నికలకు మద్యం కిక్
డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో మద్యం భారీగా అమ్ముడయ్యే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం నేపథ్యంలో డిసెంబర్ 31న కూడా విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. జనవరిలో సంక్రాంతి పండుగ సైతం కలిసిరానుంది. పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కో ఆపరేటివ్ ఇలా వరుసగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో ఈసారి భారీగా అమ్మకాలు జరిగి రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు, ఎకై ్సజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఎకై ్సజ్ అధికారులు మద్యం సరఫరా ఏర్పాట్లను వేగవంతం చేశారు.
మద్యంతో విందులు
నామినేషన్ల పర్వం కంటే ముందే పల్లెల్లో మద్యంతో కూడిన విందులు ప్రారంభమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికల్లో పోటీ పెరగడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనకాడటం లేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ వెంట వచ్చే అనుచరగణానికి నిత్యం విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక పోలింగ్ ముందు రోజు మద్యం, డబ్బుల పంపకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆనందంలో వ్యాపారులు
పంచాయతీ ఎన్నికలు కొత్త మద్యం వ్యాపారుల్లో హుషారు నింపుతున్నాయి. వ్యాపారం ప్రారంభంలోనే లక్షల్లో ఆదాయం సమకూరనుంది. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షలు చెల్లించారు. డ్రాలో షాప్‌లు దక్కించుకున్న వెంటనే ఎన్నికలు రావడంతో వ్యాపారులు ఆనందంలో ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి అన్ని విడతల్లో వారం రోజులు గడువు ఉండటం, ఇప్పటి నుంచే ఆయా స్థానాల్లో పోటీ చేయాలనుకునే వారు, పోటీ చేస్తున్న వారు మద్దతు కూడగట్టుకొని ఓట్లు పొందేందుకు మద్యాన్ని ఎరగా వేస్తున్నారు.
జోరుగా బెల్టుషాపులు
ఎన్నికల్లో మద్యం, డబ్బును అరికడతామని ఒకవైపు అధికారులు చెబుతున్నా మరోవైపు పల్లెల్లో ఇప్పటికే బెల్టు షాప్‌లు ఏర్పాటు చేసి జోరుగా మద్యం విక్రయిస్తున్నారు. మద్యం సరఫరాను నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి.
వ్యాపారులకు లక్కు
నేటి నుంచి నూతన మద్యం షాప్‌లు ప్రారంభం
కలిసివచ్చిన పంచాయతీ ఎన్నికలు
ప్రారంభంలోనే లక్షల్లో ఆదాయ మార్గం


