పటిష్ట భద్రత
ఎయిడ్స్.. నివారణే మార్గం అవగాహనతోనే ఎయిడ్స్‌ను నివారించొచ్చని, ప్రశాంత జీవనం కొనసాగించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పంచాయతీ
ఎన్నికలకు
ఆమనగల్లు: పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శంషాబాద్ డీసీపీ రాజేశ్ అన్నారు. ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల్లోని నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. అంనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లు, అనుమానితులను బైండోవర్ చేస్తామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీ నారాయణ, ఆమనగల్లు సీఐ జానకీరాంరెడ్డి, ఆమనగల్లు ఎస్‌ఐ వెంకటేశ్, తలకొండపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
ఆకస్మిక తనిఖీ
కడ్తాల్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని శంషాబాద్ డీసీపీ రాజేశ్ పోలీసు సిబ్బందికి సూచించారు. మండల పరిధిలోని ముచ్చర్ల గేట్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్ట్‌తో పాటు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం షాద్‌నగర్ ఎసీపీ లక్ష్మీనారాయణతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలతో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. చెక్‌పోస్ట్‌లో జరుగుతున్న వాహనాల తనిఖీని స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ గంగాధర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
శంషాబాద్ డీసీపీ రాజేశ్


