రైతులకు హై‘టెన్షన్’ లేకుండా చూడండి
కడ్తాల్: మండల కేంద్రంతో పాటు పరిసరా గ్రామాల వ్యవసాయ పొలాల మీదుగా బీదర్– మహేశ్వరం పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్‌మెంట్‌తో రైతులకు నష్టం జరుగకుండా చూడాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పవర్‌గ్రిడ్ అధికారులను కోరారు. ఈ మేరకు బాధిత రైతులతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర క్యాంపు కార్యాలయంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ సీజీఎం బిపిన్ బీహారిరథ్, సీనియర్ కన్సల్టెంట్ అశోక్, డీజీఎం సంతోష్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైటెన్షన్‌లైన్ బాధిత రైతుల గోడును వపర్‌గ్రిడ్ అధికారులకు వివరించారు. న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పవర్‌గ్రిడ్ అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్‌గుప్తా, మాజీ ఉప సర్పంచ్ కడారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


