సర్పంచ్ 203 .. వార్డులకు 688
షాద్‌నగర్: పంచాయతీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం శుక్రవారం రెండోరోజు కొనసాగింది. ఆశావహులు జోరుగా దాఖలు చేశారు. కొత్తూరు, ఫరూఖ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాలను శంషాబాద్ డీసీపీ రాజేష్, ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్‌కుమార్ పరిశీలించారు.
వార్డు కోసం దాఖలైనవి
ఫరూఖ్‌నగర్‌లో 133, జిల్లేడు చౌదరిగూడలో 47, కేశంపేటలో 100, కొత్తూరులో 80, కొందుర్గులో 63, నందిగామలో 96, శంషాబాద్‌లో 169 నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఏసీపీ
కొత్తూరు మండల పరిధిలోని మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ నరసయ్య, ఎస్‌ఐ సత్యశీలారెడ్డి, హెచ్‌సీ గోపాల్, కానిస్టేబుల్ నరేష్ తదితరులు ఉన్నారు.
ఉరుకులు, పరుగులు
నామినేషన్ల పర్వం రెండ రోజు అభ్యర్థులు పత్రాల కోసం అటు ఇటు పరుగులు పెట్టారు. బ్యాంకు ఖాతాలు తెరవడం, పంచాయతీల్లో ఇంటి పన్నులు, నల్లా పన్నులు చెల్లించడం, కుల ధ్రువీకరణ, ఆధార్ పత్రాల కోసం మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు కొడుతూ కనిపించారు. పలు గ్రామాల్లో ప్రతిపాదించే వారి పన్నులు బకాయిలు ఉంటే బరిలో నిలిచే వారు చెల్లిస్తున్నారు.
సర్పంచ్ కోసం దాఖలైన నామినేషన్లు
మండలం మొత్తం జీపీలు దాఖలైనవి
ఫరూఖ్‌నగర్ 47 55
జిల్లేడుచౌదరిగూడ 24 18
కేశంపేట 29 35
కొత్తూరు 12 17
కొందుర్గు 22 22
నందిగామ 19 24
శంషాబాద్ 21 32
రెండో రోజు దాఖలైన నామినేషన్లు


