మైసిగండి హుండీ ఆదాయం లెక్కింపు
మైసిగండి హుండీ ఆదాయం లెక్కింపు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత శివరామాలయాలకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని శుక్రవారం జిల్లా దేవాదాయశాఖ తూర్పు విభాగ ఇన్‌స్పెక్టర్ ప్రణీత్‌కుమార్ సమక్షంలో లెక్కించారు. మొత్తం 92 రోజులకు సంబంధించి రూ.15,16,435 ఆదాయం సమాకూరింది. ఈ మొత్తాన్ని కడ్తాల్ కెనరా బ్యాంక్‌లో డిపాజిట్ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో స్నేహలత, ట్రస్టీ శిరోలీ, నిర్వాహకులు, అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సభ్యులు, కెనరాబ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి
సమష్టిగా పోరాడుదాం
షాద్‌నగర్: ముదిరాజ్‌ల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముదిరాజ్ సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ చొప్పరి శంకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్‌లో శుక్రవారం నిర్వహించిన ముదిరాజ్ సంఘం నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. ముదిరాజ్‌లు ఆర్థిక, సామాజిక, రాజ కీయ రంగాల్లో పూర్తిగా వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగా లని పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎదగాలంటే పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఉన్న ప్రతి చోట నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. రాష్ట్రం కోసం ప్రాణాలు కోల్పోయిన తొలి అమరుడు పోలీస్ కిష్టన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు అందె బాబయ్య, ఉప్పరి నారాయణ, శ్రీనివాస్, గుండ్లపల్లి శ్రీను, రావుల రాజశేఖర్, భీమ లక్ష్మణ్, మద్దెల సంతోష్, మొగిలి యాదగిరి, శైలేంద్ర, శివయ్య, చలపతి, రాజు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
కొత్త విత్తన చట్టంపై
అవగాహన ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: పాత విత్తన చట్టాన్ని మార్చి కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని జిల్లా వ్యవసాయాధికారి ఉష తెలిపారు. చట్టం ముసాయిదాపై కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో శుక్రవారం అవగాహన, అభిప్రాయ సేకరణ నిర్వహించారు. డాట్ సెంటర్ శాస్త్రవేత్త మధుశేఖర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన ముసాయిదా గురించి వివరించారు. అనంతరం అభిప్రాయ సేకరణ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సురేష్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ, రైతులు, విత్తన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, మండల స్పెషలాఫీసర్ కె. నవీన్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం గ్రామ కార్యదర్శులు, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, లైట్లు, మౌలిక సదుపాయాలతోపాటు దివ్యాంగుల కోసం ర్యాంపు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమ్మ, ఎంపీఓ ఉష, సూపరింటెండెంట్ ఎల్లంకి జంగయ్యగౌడ్ పాల్గొన్నారు.
1/2
మైసిగండి హుండీ ఆదాయం లెక్కింపు
2/2
మైసిగండి హుండీ ఆదాయం లెక్కింపు