ఉన్నతాధికారుల సమీక్ష
గ్లోబల్ సమ్మిట్ ప్రాంతంలో ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు వివిధ శాఖల ముఖ్య అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, టీజీఐఐసీ ఎండీ శశాంక, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, రాచకొండ సీపీ సుధీర్ బాబు, డీసీపీ నారాయణరెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం గ్లోబల్ సమ్మిట్ ప్రాంతంలో కొనసాగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, ఆర్డీఓ అనంత్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


