భూములు లాక్కోవద్దు
కడ్తాల్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడ్తాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల కూడలి వద్ద గురువారం ప్రత్యేకంగా చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఐ గంగా ధర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు శాంతి, క్రమశిక్షణ పాటించాలని అన్నారు. ఎవరైనా గందరగోళ పరిస్థితులు సృష్టించాలని ప్రయత్నిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మద్యం అనధికారికంగా విక్రయించినా, అధిక ధరలకు అమ్మినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, అనుమానాస్పదంగా సంచరించినా పోలీసులకు తెలపాలన్నారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్తే సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ వరప్రసాద్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
అసభ్య పదజాలంతో బెదిరింపులకు పాల్పడిన కబ్జాదారులు
తుర్కయంజాల్: ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టడమే కాకుండా, అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెంట్ మండల పరిధి ఇంజాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్, గ్రామ పాలన అధికారి సుప్రియ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ సర్వే నంబర్ 126లో స్వామి, విజయ్ కుమార్ అనే వ్యక్తులు సుమారు 300 గజాల స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణ పనులను కొన్ని రోజులుగా చేపడుతున్నారు. మొదటి నుంచి ఇది ప్రభుత్వ భూమి అని ఇందులో నిర్మాణం చేపట్ట వద్దని చెప్పినా వినడం లేదన్నారు. తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్మాణం వద్దకు వెళ్లగా అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. ఈ మేరకు కబ్జాదారులపై ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు. అక్రమ నిర్మాణం చుట్టూ తహసీల్దార్ ఆదేశాల మేరకు జేసీబీ సహాయంతో కందకం తవ్వించినట్లు చెప్పారు.
భూములు లాక్కోవద్దు
భూములు లాక్కోవద్దు


