కడ్తాల్‌కు మంత్రి సీతక్క
కడ్తాల్: శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి వెళ్లిన మంత్రి సీతక్క బుధవారం హైదరాబాద్‌కు వెళ్తూ కడ్తాల్ మండల కేంద్రంలో ఆగారు. రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్ అలీ నివాసంలో అల్పాహారం చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆసీఫ్ అలీ నివాసానికి చేరుకుని మంత్రి సీతక్కను సన్మానించారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మంత్రిని సన్మానించిన వారిలో నాయకులు మహేశ్, రాజేశ్‌క్యామ, జహంగీర్‌అలీ, అజ్గర్‌అలీ, ఇమ్రాన్‌బాబా, రజనీకాంత్, శివనాయక్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.


