భవనం పైకెక్కి యువకుడి హల్‌చల్
● కుటుంబ సభ్యులతో
గొడవపడి మనస్తాపం
● పోలీసుల చొరవతో
కిందికి దిగిన యువకుడు
తుర్కయంజాల్: కుటుంబ సభ్యులతో నెలకొన్న మనస్పర్థల కారణంగా ఓ యువకుడు ఐదంతస్తుల భవనం ఎక్కి హల్‌చల్ చేశారు. ఈ సంఘటన పురపాలక సంఘం పరిధి స్నేహపురి కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. శుభం అనే యువకుడు అమెజాన్‌లో ఉద్యోగం చేస్తు ఉపాధి పొందుతున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ మనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఓ భవనంపైకి ఎక్కి దూకుతానని బెదిరించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ అనిల్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని, యువకుడికి నచ్చజెప్పి కిందికి దించారు. అనంతరం తన డిమాండ్లను పైపర్‌పై రాసిచ్చాడు. ఇదిలా ఉండగా శుభంకు మాటలు స్పష్టంగా రావని, చెవుడు కూడా ఉందని తెలిసింది.


