రూ.పది లక్షలు పట్టుబడితే ఇన్‌కమ్ ట్యాక్స్‌కు..
రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్‌గౌతమ్
షాబాద్: పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్, నాకాబందీ, వాహనాల తనిఖీలు చేపడుతున్నామని రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ అన్నారు. బుధవారం ఆయన షాబాద్ ఠాణా పరిధి లో ఐదు ప్రాంతాల్లో నాకాబందీ చేపట్టారు. ఈ సందర్భంగా డీసీపీ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ.. ఎన్నికలలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధలన ప్రకారం రూ.పది లక్షలకు పైగా నగదు పట్టుబడితే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తామన్నారు. రూ.50వేల నుంచి రూ.పది లక్షల లోపు నగదు పట్టుబడితే కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కమిటీకి అందజేస్తామన్నారు. ఎన్నికల తర్వాత సరైన ఆధారాలు తీసుకువచ్చి డబ్బు తీసుకువెళ్లొచ్చన్నారు. ఈ తనిఖీల్లో రూ.లక్ష నగదు, నంబర్ ప్లేట్ లేని ఆరు వ ఆహనాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు లేని 26 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ కిషన్, షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్‌ఐలు రమేశ్, సతీశ్‌కుమార్ తదితరులున్నారు.


