రాజ్యాంగాన్ని అనుసరించాలి
శంకర్‌పల్లి: భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతీ అంశాన్ని అందరూ అనుసరించాలని ఇక్ఫాయ్ లా స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ రవిశేఖర రాజు అన్నారు. బుధవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇక్ఫాయ్ డీమ్డ్ వర్సిటీ లా స్కూల్‌లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులతో రాజ్యాంగంలోని విలువలు, విధులు సక్రమంగా పాటిస్తామని చెబుతూ ప్రతిజ్ఞ చేయించారు. ప్రొఫెసర్ రవిశేఖర రాజు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతీ పౌరునికి సమాన హక్కులను కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


