బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదు
తాండూరు రూరల్: బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే ఉండదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పెద్దేముల్ మండలం మంబాపూర్‌లో 30 అడుగుల బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. లిక్కర్ కేసులో మేం మాజీ ఎంపీ కవితను లోపల వేశామని.. కాంగ్రెస్‌కు దమ్ముంటే ఫార్ములా – ఈ రేసు కేసులో కేటీఆర్‌ను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం, ఇతర కుంభకోణాల్లో కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని ఓడించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి పని చేశాయన్నారు. భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ సమావేశానికి అప్పటి సీఎం కేసీఆర్ బస్సులు పంపారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి భారీగా నిధులు ఇస్తోందని తెలిపారు. ఆవాస్ యోజన కింద తెలంగాణకు నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లు మంజూరు చేస్తోందని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రూ.13 కోట్లు వెచ్చించి 200 సీసీ రోడ్లు వేశామని పేర్కొన్నారు.
దేశానికి బీజేపీ అవసరం ఉంది
దేశానికి బీజేపీ అవసరం ఉందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బిహార్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని చెప్పారు. దేశ ప్రజలు ప్రధాని మోదీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ స్ఫూర్తిలో దేశం ఐక్యత సాధిస్తోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో డీ లిమిటేషన్ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరగవచ్చని అన్నారు. రెండు వారాల క్రితం గుండె చికిత్స చేయించుకున్న ఆయన మొదటి సారి జిల్లాకు వచ్చారు.
ప్రహ్లాద్‌రావే.. జిల్లా అధ్యక్షుడు
ప్రస్తుతం పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌గా వ్యహరిస్తున్న ప్రహ్లాద్‌రావును జిల్లా అధ్యక్షుడిగా అనుకోవాలని ఎంపీ కొండా అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలో దింపాలన్నారు. కార్యకర్తలే బీజేపీ బలమన్నారు. కార్యక్రమంలో పార్టీ వికారాబాద్ ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్‌గుప్తా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్‌కుమార్, నాయకులు వడ్ల నందు, శ్రీధర్‌రెడ్డి, కృష్ణ, రాంచెందర్, వీరారెడ్డి, రాజు, శాంతుకుమార్, లలిత, సాహు శ్రీలత, వీరేశం, సందీప్, ఆంజనేయులు, వడ్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
మేం కవితను లోపల వేశాం
కాంగ్రెస్‌కు దమ్ముంటే కేటీఆర్‌ను జైల్లో పెట్టాలి
సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మంబాపూర్‌లో 30 అడుగుల బీజేపీ జెండా ఆవిష్కరణ


