ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు
ఆమనగల్లు: రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానలపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగే కార్యక్రమానికి వెళుతున్న ఆయనకు స్థానిక నేతలు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం రాంచందర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని విమర్శించారు. అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఉద్యమించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహ, జిల్లా కౌన్సిల్ మెంబర్ లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్‌సింగ్, నాయకులు చెన్నకేశవులు, శీధర్, శ్రీనివాస్, రాఘవ, జగన్‌రెడ్డి, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
ఘన స్వాగతం
కడ్తాల్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పర్యటనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు సోమవారం కడ్తాల్‌లో పార్టీ మండల అధ్యక్షుడు దోనాదుల మహేశ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అచ్చంపేట్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, నాయకులు సాయిలాల్‌నాయక్, రవీందర్‌రెడ్డి, మాన్యనాయక్, శ్రీశైలంగౌడ్, భగీరథ్, వెంకటేశ్, సాయి ప్రభు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు


