సర్పంచ్ రిజర్వేషన్లపై ఆగ్రహం
బీసీలకు ఒక్కస్థానం కేటాయించలేదని నిరసన
ఆమనగల్లు: గ్రామపంచాయతీ రిజర్వేషన్లపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆమనగల్లు మండలంలో ఉన్న 13 పంచాయతీలకు ఒక దాన్ని కూడా బీసీలకు కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారని పలు బీసీ సంఘాలు బ్యాక్ గ్రౌండ్ వ్యక్తం చేస్తున్నాయి. ఏ విధంగా చూసినా కనీసం రెండు గ్రామపంచాయతీలు అయిన బీసీలకు కేటాయిస్తారని ఎదురు చూశారు. కానీ రిజర్వేషన్ల చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
సర్పంచుల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆమనగల్లు పట్టణంలో సోమవారం హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహ, జిల్లా కౌన్సిల్ మెంబర్ లక్ష్మణ్, నాయకులు శ్రీకాంత్‌సింగ్, చెన్నకేశవులు, శీధర్, శ్రీనివాస్, రాఘవ, జగన్‌రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలపై ఉన్న ప్రేమ ఇదేనా
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఉన్న ప్రేమ ఇదేనా అని బీఆర్‌ఎస్ ఆమనగల్లు మున్సిపాలిటీ గౌరవధ్యక్షుడు చుక్క నిరంజన్‌గౌడ్ ప్రశ్నించారు. పట్టణంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. 13 గ్రామ పంచాయతీలు ఉండగా బీసీలకు ఒకటి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. మండలంలో బీసీలకు రెండు గ్రామ పంచాయతీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పెద్దయ్యయాదవ్, వెంకటేష్, గణేష్, శివ, నిరంజన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


