ఉద్యమకారులను ఆదుకునేలా చూడండి
షాద్‌నగర్: ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.వెంకట్‌రాంరెడ్డి అన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి ఆధ్వర్యంలో శనివారం పలువురు నాయకులు ఉద్యమకారుల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వెంకట్‌రాంరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమకారులను ఆదుకుంటామని, వారి అభివృద్ధికి తగిన విధంగా కృషి చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ఉద్యమకారులు, ఎన్నోఏళ్లు పోరా టం చేశారని, ప్రస్తుతం వారు ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు విద్యాసాగర్, టీజీ శ్రీనివాస్, కళ్లెం నర్సింహారెడ్డి, ఆంజనేయులు, ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలపై
అవగాహన
చేవెళ్ల: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాలల పరిరక్షణ విభాగం జిల్లా అధికారి భాను ప్రకాశ్ అన్నారు. ఊరెళ్ల సమీపంలోని సాగర్ కళాశాలలో ఉన్న బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం చేవెళ్ల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్యవివాహలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భాను ప్రకాశ్ మాట్లాడుతూఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపా రు. బాల్య వివాహాలు జరిపిస్తే రూ.లక్ష జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష పడుతుందని చెప్పా రు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. గ్రామ స్థా యిలో అధికారులు బాల్యవివాహాలు జరగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ అనురాధ, డాక్టర్ అ నూష,పాఠశాల ఉపాధ్యాయులు,అంగన్‌వాడీ టీచర్లు,ఆశావర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
వచ్చేనెల 10, 11 తేదీల్లో జాతీయ సదస్సు
చేవెళ్ల: వచ్చేనెల 10, 11 తేదీల్లో చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ మల్టీ డిసిప్లీనరీ సదస్సు నిర్వహిచనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంచనలత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘భారతదేశ రోడ్డు మ్యాప్ టు ఎస్‌డీజీ–16, శాంతి న్యాయం సమగ్ర సమాజాల బలోపేతం’ అంశంపై సదస్సు ఉంటుందని చెప్పారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి ప్రముఖ ఆచార్యులు, పరిశోధకులు, నిపుణులు హాజరవుతారని తెలిపారు.
రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయండి
యాచారం: నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూముల రికార్డులను రైతుల పేర్లపై నమోదు చేయాలని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో భూ బాధితులు శనివారం కలెక్టర్ నారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఫార్మాసిటీకి పట్టా భూములు ఇవ్వకపోయినా నాలుగేళ్లుగా రికార్డుల్లో టీజీఐఐసీ పేరు నమోదు చేసి పరిహారం డబ్బులను అథారిటీలో జమ చేశారని తెలిపా రు. దీంతో రికార్డుల్లో తమ పేర్లు లేక అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోలేక, బ్యాంకు రు ణాలు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ రాక తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఇకనైనా తమ పేర్లపై భూ రికార్డులు నమోదు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, యాచారం తహసీల్దార్‌తో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఉద్యమకారులను ఆదుకునేలా చూడండి
ఉద్యమకారులను ఆదుకునేలా చూడండి


