పొరపాట్లకు తావివ్వొద్దు
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి పనులను ఎలాంటి పొరపాట్లు లేకుండా, త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ఫ్యూచర్‌సిటీ పరిధిలోని మీర్‌ఖాన్‌పేట రెవెన్యూలో డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ప్రాంతాన్ని శనివారం ఆయన సందర్శించారు. సమ్మిట్ నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లతో పాటు హెలిపాడ్ పనులను పరిశీలించారు. సమ్మిట్ విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ విధులను బాధ్యతతో నిర్వర్తించాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఏసీపీ కేవీ రాజు, తహసీల్దార్ గోపాల్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.


