పశు సంరక్షణకు ప్రాధాన్యం
ఏజీవర్సిటీ: పశు సంరక్షణ, పశు సంపద వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పశు సంరక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ ఇలంబర్తి తెలిపారు. రాష్ట్రంలో చేపలు, గొర్రెలు, మేకల పెంపకానికి అధిక నిధులు కేటాయించిందన్నారు. రాజేంద్రనగర్‌లోని పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం 11వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఇలంబర్తి ఐసీఏఆర్–షెడ్యూల్ కుల ఉప ప్రణాళిక నిధుల కింద మంజూరైన ఈ–రిసోర్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడ్డు, మాంసం ఉత్పత్తుల ద్వారా చౌకై న ప్రొటీన్‌ను పశు సంరక్షణ శాఖ ద్వారా అందిచవచ్చని తెలిపారు. దశాబ్ద కాలంలో విశ్వవిద్యాలయం సాధించిన పురోగతిని అభినందించారు. అలుమ్ని కనెక్ట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. పాడి రైతులకు పెంపుడు జంతువులకు అందించే ఉత్తమ క్లినికల్ సే వలను ప్రశంసించారు. రాష్ట్ర జనాభా పెరిగిన కొద్దీ పశు సంరక్షణ, పశు పెంపకం పెంచాలని సూచించారు. కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ రాజీరెడ్డి మాట్లాడుతూ.. పశు వైద్య విశ్వవిద్యాలయం వీసీ జ్ఞానప్రకాశ్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంతోపాటు మమ్నూర్, కోరుట్ల, ల్యాబ్‌లు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయన్నారు.


